Gold Prices: హెచ్చుతగ్గులతో కొనుగోలు దారులను పరేషాన్ చేస్తున్న పసిడి ధరలు ఆదివారం బులియన్ మార్కెట్ లో స్థిరంగా ఉన్నాయి. దీంతో కొనుగోలుదారులకు స్వల్ప ఊరట దక్కింది. హైదరాబాద్ మార్కెట్ లో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 90,450వద్ధ ఉంది. 24క్యారెట్ల 10గ్రాముల ధర రూ.98,680గా ఉంది. చెన్నై, ముంబాయి, బెంగుళూరులలో అవే ధరలు కొనసాగుతున్నాయి. న్యూఢిల్లీలో 22క్యారెట్లకు రూ.90,600, 24క్యారెట్లకు రూ. 98,830గా ఉంది.
దుబాయ్ 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.86,271, 24క్యారెట్లకు రూ.93,131గా ఉంది. అమెరికాలో రూ. 85,837 గా, రూ.91,816గా కొనసాగుతుంది.
వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. కిలో వెండి ధర రూ. 1,11,000గా కొనసాగుతుంది.