Elephant calf dies | అభయారణ్యంలో దారుణం – నాటు బాంబుకు ఏనుగు పిల్ల బలి

సత్యమంగళం పులుల అభయారణ్యంలో అడవి పందుల వేట కోసం పెట్టిన నాటు బాంబు నోట్లో పేలడంతో ఒకన్నర ఏళ్ల ఏనుగు పిల్ల మృతి చెందింది.  ఒకరిని  అరెస్ట్ చేయగా, ఇంకొకరు పరారీలో ఉన్నాడు. నాటు బాంబులతో వేటాడటం పెరగడం పట్ల అటవీశాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

View of Sathyamangalam Tiger Reserve with title graphic about elephant calf killed by country-made bomb.

Elephant Calf Dies After Eating Crude Country Bomb in Sathyamangalam Tiger Reserve; One Arrested

విధాత భారత్​ డెస్క్​ | హైదరాబాద్​:

Elephant calf dies | తమిళనాడులోని సత్యమంగళం పులుల అభయారణ్యం (Sathyamangalam Tiger Reserve – STR)లో జరిగిన హృదయవిదారక ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అడవి పందుల వేట కోసం ఎరగా వేసిన నాటు బాంబును పొరబడి తినడంతో ఒకన్నర ఏళ్ల ఏనుగు పిల్ల మృతి చెందింది. జనవరి 10న బూతికాడు రేంజ్‌లో రోజూవారీ పెట్రోలింగ్​ సమయంలో అటవీ సిబ్బంది మృతదేహాన్ని గుర్తించి పైఅధికారులకు సమాచారం అందించారు.

Tamil Nadu Elephant Death Audit Framework (EDAF) ప్రకారం జరిగిన పోస్ట్‌మార్టంలో, STR వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ చేసిన పరిశీలనలో నాటు బాంబు పేలడంతో ఏనుగు పిల్ల దవడ, నాలుక, అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు నిర్ధారణ అయింది. కీలక అవయవాల నమూనాలు ప్రయోగశాలకు పంపబడ్డాయి. అడవిపందుల వేట కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి నాటు బాంబులు తినేవాటితో కలిపి ఎరగా వేయడం సాధారణమని అధికారులు చెప్పారు.

ALSO READ: పంట కాపలాదారులను తొక్కిచంపిన అడవి ఏనుగులు

ఒకరు అరెస్ట్ – పరారీలో మరో నిందితుడు

ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) వేగంగా పరిశోధన చేపట్టింది. ఎక్కత్తూరు సెక్షన్ ఫోరెస్టర్ నేతృత్వంలోని బృందం థొందూర్‌కు చెందిన కే. కాలిముత్తూర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది. మరో నిందితుడు పరారీలో ఉండడంతో గాలింపు కొనసాగుతోంది. నాటు బాంబు వినియోగం కారణంగా కదంబూరు పోలీసులకు సమాచారం అందించి వన్యమృగాల చట్టం కింద కేసు నమోదు చేశారు.

వేటలో నాటు బాంబుల వాడకం పెరుగుదలపై ఆందోళన

అడవిపందుల వేట కోసం నాటు బాంబుల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో వన్యమృగాలు తరచూ వాటికీ బలవుతున్నాయని అటవీశాఖ పేర్కొంది. STR వంటి ముఖ్యమైన అభయారణ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం వన్యప్రాణి కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పెట్రోలింగ్ పెంచడం, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Latest News