GST Collections | దండిగా జీఎస్టీ ఆదాయం.. చరిత్రలో రెండోసారి అత్య‌ధిక ఆదాయం

GST Collections | విధాత: మార్చిలో జీఎస్టీ వసూళ్లు 13శాతం పెరిగి రూ.1.60 లక్షల కోట్లకు చేరాయి. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మార్చి 2023లో స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,60,122 కోట్లుగా ఉన్నది. ఇందులో సీజీఎస్టీ రూ.29,546 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.37,314 కోట్లు, ఐజీఎస్టీ రూ.82,907 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.42,503 కోట్లతో కలిపి), సెస్ రూ.10,355 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చిలో జీఎస్టీ వసూళ్లు […]

  • Publish Date - April 1, 2023 / 02:16 PM IST

GST Collections |

విధాత: మార్చిలో జీఎస్టీ వసూళ్లు 13శాతం పెరిగి రూ.1.60 లక్షల కోట్లకు చేరాయి. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మార్చి 2023లో స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,60,122 కోట్లుగా ఉన్నది.

ఇందులో సీజీఎస్టీ రూ.29,546 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.37,314 కోట్లు, ఐజీఎస్టీ రూ.82,907 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.42,503 కోట్లతో కలిపి), సెస్ రూ.10,355 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చిలో జీఎస్టీ వసూళ్లు నాలుగోసారి రూ.1.5 లక్షల కోట్లు దాటాయి.

జీఎస్టీ అమలు తర్వాత ఇంత మొత్తంలో వసూలవడంతో ఇది రెండోసారి. మార్చి నెలలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక IGST వసూలయ్యాయి. గతేడాది మార్చితో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు 13శాతం పెరిగాయి.

ఈ నెలలో వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం గత సంవత్సరం కంటే 8శాతం అధికం. దేశీయ లావాదేవీల (సేవల దిగుమతితో సహా) ఆదాయం గత సంవత్సరం ఇదే నెలలో ఈ వనరుల నుండి వచ్చిన ఆదాయం కంటే 14శాతం ఎక్కువగా నమోదైంది.

మార్చి 2023లో రిటర్న్ ఫైలింగ్ ఇప్పటివరకు అత్యధికం. ఇదిలా ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 18.10లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. సగటున నెలకు 1.51లక్షల కోట్లు వసూలయ్యాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం 2021-22తో పోలిస్తే 22శాతం వృద్ధి నమోదైందని ఆర్థికశాఖ వివరించింది.

Latest News