విధాత, హైదరాబాద్ : కొత్త ఏడాది 2026 తొలి రోజున బంగారం ధరలు పెరుగుదల(Gold price increase)ను నమోదు చేయగా..వెండి ధరలు తగ్గుదల(Silver price fall)ను నమోదు చేశాయి. గురువారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 170పెరిగి రూ.1,35,060వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.150పెరిగి రూ.1,23,800కు చేరింది. వరుసగా ఐదు రోజుల తగ్గుదల తర్వతా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేయడం విశేషం.
రూ.1000తగ్గిన వెండి ధర
వెండి ధర వరుసగా ఐదో రోజు తగ్గుదలను నమోదు చేసింది. గురువారం రూ.1000తగ్గిన కిలో వెండి ధర రూ.2,56,000వద్ద కొనసాగుతుంది.
డిసెంబర్ 27న రూ.2,85,000గా ఉన్న వెండి ధర జనవరి 1వ తేదీకి వచ్చేసరికి రూ.29,000తగ్గడం గమనార్హం. 2025లో 150శాతం పెరుగుదలను నమోదు చేసిన వెండి ధరలు 2026లోనూ పెరుగడం ఖాయమని..బంగారం ధరలు కూడా ఈ ఏడాది మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, డాలర్ విలువ, వడ్డీ రెట్లు, పారిశ్రామిక అవసరాలు, బంగారం వెండి లోహాల ఉత్పత్తి, డిమాండ్ ల మధ్య వ్యత్యాసాలు వంటి పరిణామాల నేపథ్యంలో వాటి ధరలు పెరుగదలకు దోహదం చేస్తాయంటున్నారు.
మరోవైపు ప్లాటినం ధర కొత్త ఏడాది తొలి రోజును 10గ్రాములపై ఏకంగా రూ.1,340పెరిగి రూ.59,750కి చేరడం విశేషం. డిసెంబర్ 1న రూ.48,730గా ఉండటం గమనార్హం.
