రాజీనామా వార్తలపై గవర్నర్ తమిళి సై క్లారిటీ..

తాను ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నానని, అందుకోసం తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేస్తానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని గవర్నర్ తమిళి సై స్పష్టం చేశారు

  • Publish Date - December 30, 2023 / 09:16 AM IST

విధాత : తాను ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నానని, అందుకోసం తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేస్తానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని గవర్నర్ తమిళి సై స్పష్టం చేశారు. శనివారం ఆమె బోయినపల్లి అనురాధ టింబర్ డిపోను సందర్శించారు. అయోధ్య రామాలయ ద్వారాలు, కళాకృతులను పరిశీలించారు.


ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ నేను ఎప్పుడూ ప్రజలతోనే ఉంటానని, ప్రస్తుతం తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌గా పనిచేస్తున్నానని, ప్రధాని మోడీ, రాముడి దయతో నా విధులు నిర్వహిస్తున్నానన్నారు. హైకమాండ్ ఏ బాధ్యతలు ఇచ్చినా తాను సిద్ధమేనన్నారు. ఎంపీగా పోటీ చేస్తానని తాను హైకమాండ్ ను కోరలేదన్నారు. ఇందుకోసం ఢిల్లీ వెళ్లలేదని, వరద బాధితులను పరామార్శించేందుకు తుత్తుకూడి వెళ్లి వచ్చానన్నారు.