విధాత: పద్ధతిగా ఉండాల్సిన ఓ ప్రభుత్వ ఉద్యోగి.. పని మనిషి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. భర్తను కోల్పోయిన ఆమెపై కన్నేసి, లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. తన గదిని శుభ్రం చేయాలని పిలిపించుకుని, ఆమెను గట్టిగా కౌగిలించుకొని, బలవంతంగా ముద్దు పెట్టాడు. ఈ ఘటన తమిళనాడులోని నుంగబాక్కంలో చోటు చేసుకుంది.
తమిళనాడుకు చెందిన రోక్స్ గాబ్రియేల్ ఫ్రాంక్టన్(36) సీనియర్ ట్యాక్స్ ఆఫీసర్‌గా నుంగబాక్కంలోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే ఆఫీసులో ఓ మహిళ పని మనిషిగా పని చేస్తోంది. ఆమె భర్త ఐదేండ్ల క్రితం మరణించిన విషయం రోక్స్‌కు తెలిసింది. దీంతో ఆమెపై కామంతో కన్నేశాడు.
అయితే డిసెంబర్ 14వ తేదీన గదిని శుభ్రం చేయడానికి ఆమెను రోక్స్ పిలిచాడు. గదిని శుభ్రం చేస్తుండగా, ఆమెను కౌగిలించుకుని, బలవంతంగా ముద్దు పెట్టాడు. భయపడ్డ ఆమె బయటకు పరుగెత్తుకు వచ్చి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది.
ఉన్నతాధికారులు రోక్స్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. రోక్స్ లైంగిక వేధింపులు భరించలేక బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.