ఘనంగా రథసప్తమి వేడుకలు.. సూర్య‌ప్ర‌భ వాహ‌నంపై తిరువీధుల్లో యాద‌గిరీశుడు

విధాత: రథసప్తమి పర్వదిన వేడుకలు శ‌నివారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రముఖ ఆలయాలు, సూర్య దేవాలయాల్లో వైభవంగా నిర్వహించారు. రథసప్తమి పురస్కరించుకొని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి వారు ఉదయం సూర్య ప్రభ వాహనంపై తిరువీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సూర్య వాహనాధీశుడైన యాదగిరిశుడిని దర్శించుకున్న భక్తులు ఆనందపరవశులయ్యారు. ఈ వేడుకల్లో ఆలయ ఈవో గీత, అధికారులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అటు జిల్లాలోని అడవిదేవులపల్లి సూర్య దేవాలయం, పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం, వలిగొండ […]

  • Publish Date - January 28, 2023 / 11:01 AM IST

విధాత: రథసప్తమి పర్వదిన వేడుకలు శ‌నివారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రముఖ ఆలయాలు, సూర్య దేవాలయాల్లో వైభవంగా నిర్వహించారు. రథసప్తమి పురస్కరించుకొని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి వారు ఉదయం సూర్య ప్రభ వాహనంపై తిరువీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

సూర్య వాహనాధీశుడైన యాదగిరిశుడిని దర్శించుకున్న భక్తులు ఆనందపరవశులయ్యారు. ఈ వేడుకల్లో ఆలయ ఈవో గీత, అధికారులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అటు జిల్లాలోని అడవిదేవులపల్లి సూర్య దేవాలయం, పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం, వలిగొండ త్రిశక్తి సూర్య దేవాలయాల్లో రథసప్తమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆధిత్యుడి పూజల్లో పాల్గొని త‌రించారు.