విధాత: వంటిల్లు లేని ఇల్లు కట్టాలని అన్నారు విమలక్క, ఈ వంటిల్లు స్త్రీలను లోపలి నుంచి చంపేస్తుందనీ వోల్గా నాయకి సహజ వాపోయింది. వీళ్లంతా progressive women. కానీ అత్యంత సామాన్యంగా, తన బతుకు తనదే అనే ఆలోచనతో, జీవితం అలాగే ఉంటుందన్న కలలతో కొత్తగా వైవాహిక జీవితం లోకి అడుగు పెట్టిన నవ వధువు కలలను ఎలా ఇంటి చాకిరీ మింగేసిందో తెలిపే కథే great Indian kitchen.
కథలోకి వస్తే..
చదువుకున్న, డాన్సర్ ఆయిన అమ్మాయికి ఒక స్కూల్ టీచర్‌తో వివాహం జరుగుతుంది. అమ్మాయి వాళ్ళు పెద్ద సాంప్రదాయిక కుటుంబం కాదు కానీ అత్తవారిల్లు మాత్రం మహా సాంప్రదాయిక పితృస్వామ్య కుటుంబం. భర్త నిద్ర లేచాక బ్రష్ పేస్ట్ అందించటం నుంచి, బయటికి వెళ్తుండగా చెప్పులు కాలికి అందించటం వరకు అన్నీ భార్య స్వయంగా చేయాలని తన పనుల ద్వారా కొత్త కోడలికి మార్గదర్శనం చేస్తుంటుంది అత్తగారు. చెప్పకనే ఇక నీ బతుకు కూడా ఇంతే అనిపిస్తుంది కొత్త కోడలి గురించి ప్రేక్షకుడికి.
ఇక ఆ ఇంటి పురుషులు కాస్త కూడా సెన్సిబిలిటీ లేకుండా బిహేవ్ చెయ్యటం జీర్ణించుకోవడం కష్టమే. ఎవరూ.. పరుషంగా ఒక్క మాట కూడా అనరు, ఎక్కడా రూల్స్ కనబడవు కానీ అవి అలా అమలవుతూ ఉంటాయి. పురుషులు ముందు భోంచేయ్యాలి.. సరే తింటారు పో అనుకుంటే కాస్త కూడా manners లేకుండా తిని డైనింగ్ టేబుల్ durtyగా వదిలేసి లేచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత తినాల్సిన ఆడవాళ్ళ గురించి కాస్త కూడా ఆలోచన లేకుండా.
ఇన్ని ఇబ్బందికర పరిణామాల మధ్య కొత్త కోడలికి ఇంటి బాధ్యత అప్పగించి కూతురికి delivery చెయ్యడానికి వెళ్తుంది అత్తగారు. ఇక ఆమె పాట్లు అంతా ఇంతా కాదు. ఇంటి చాకిరీ, మగవాళ్ళకు చేసే సేవలు మాత్రమే కాదు, అంట్లు, బట్టలు, leak అవుతున్న షింక్ పైప్, అతిథులకు సత్కారాలు వీటి మధ్య ఆమెకు monthly period time రావటం ఆ సమయంలో పాటించే పద్ధతులు వీటి మధ్య ఇమిడెందుకు శతధా ప్రయత్నం చేస్తుంది.
ఒక సారి అతని table manners గురించి చెప్పేందుకు ప్రయత్నించి భంగ పడుతుంది. మరో సారి సెక్స్ లో తనకు అసౌకర్యం గురించి మాట్లాడితే నీకు ముందే తెలుసా ఇవన్నీ అని అవమానకరంగా మాట్లాడతాడు ఆమె భర్త. ఉద్యోగం చెయ్యాలన్న ఆమె ప్రయత్నాన్ని మధ్యలోనే అడ్డుకుంటారు.
“మీ అత్త గారు కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ నేను మా నాన్న మాట గౌరవించి ఆమెను ఉద్యోగం చెయ్య నివ్వలేదు. ఆడవాళ్ళు ఇంట్లో ఉండటం ఇంటికి లక్ష్మి” అని జ్ఞాన బోధ చేస్తాడు మామ గారు. ఆ ఇంట్లో ఆడవాళ్ళకి మెన్సెస్ టైం ఒక పరీక్ష. విపరీతమైన వివక్ష. ఇక ఇంట్లో దీక్షలో ఉన్న మగవాళ్ళు ఉంటే అదింకా ఘోరం.
భరించలేక తల్లితో చెబితే అంతటి సంప్రదాయ కుటుంబంలో ఉండటం నీ పూర్వ జన్మ పుణ్య ఫలం అని చెబుతుంది. ఈ పరిస్థితుల్లో మొగుడి ముఖాన కలాపి చల్లి ఆ ఇంటి నుంచి బయట పడి పుట్టిల్లు చేరుతుంది. అక్కడ ఆమె తల్లి నచ్చజెప్పే సమయంలో తమ్ముడు వచ్చి తల్లిని మంచినీళ్ళు అడుగుతాడు. తల్లి, చిన్న కూతురికి చెబుతుంది అతనికి నీళ్ళివ్వమని. ఆ సమయంలో ఆమె ఎంత frustrate అవుతుందంటే.. వాడకి చేత కాదా నీళ్ళు తెచ్చుకుని తాగటం, నువ్వు కూచో అని చెల్లి మీద అరి చేస్తుంది.
ఈ ఒక్క సీన్ తో అప్పటి వరకు ఆమె చాకిరిలో ఎంత విసిగి పోయిందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆమె ఇండిపెండెంట్ గా ఎదుగుతుంది డాన్స్ teacherగా స్థిర పడుతుంది. ఇది స్థూలంగా ఈ సినిమా కథాంశం. ఆమె భర్త మరో వివాహం చేసుకొని ఆమె తో కూడా సరిగ్గా ఇలాగే వంటింటి పని చేయిస్తుండటం తో సినిమా ముగుస్తుంది.
ఇలా చదివితే పెద్ద కొత్తేముంది అనిపిస్తుంది. కానీ అత్యంత సహజ చిత్రీకరణతో మనింట్లోనే జరుగుతున్న భావన కలుగుతుంది cinema చూస్తున్నంత సేపు. సినిమా మొత్తం లో చూపిందంతా వంట పని, ఇంటి పని, అంట్లు కడగటం, షింక్ శుభ్రం చెయ్యటమే. అవెంత అసహ్యమో, ఆ పని ఆడవాళ్ళకే ఎందుకో అనే ఆలోచన రాకుండా ఉండదు. సినిమా కాస్త కూడా బోర్ కొట్టదు. ఆలోచన రేకెత్తించే ఈ సినిమా అందరూ తప్పక చూడాలి.
రచించి, దర్శకత్వం వహించింది jeo baby. 2021 కేరళ ప్రభుత్వ ఉత్తమ సినిమా అవార్డ్ సొంతం చేసుకుంది. సినిమాటోగ్రఫీ salu k. Thomas. చాలా సహజమైన చిత్రీకరణ. Music, కూడా ఆకట్టుకుం టుంది. bgm మనల్ని ఆ పరిసరాల్లో నిలబెడుతుంది. ఈ మలయాళ సినిమా primeలో stream అవుతోంది. తప్పక చూడండి.