షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌

విధాత‌: వైఎస్‌ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. సీఎం కేసీఆర్‌, రాజకీయ, మతపరమైన అంశాలపై రెచ్చగొట్టే మాట‌లు మాట్లాడవద్దని కోర్టు హెచ్చ‌రించింది. సర్సంపేట పోలీసులు షర్మిల పాదయాత్రకు అనుమతి రద్దు చేశారని, అనుమతి ఇవ్వాలని వైఎస్‌ఆర్‌టీపీ సభ్యుడు రవీంద్రనాథ్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాదయాత్రకు ఆటంకాలు సృష్టించారని పిటిషనర్‌ పేర్కొన్నారు. పాదయాత్ర కోసం తాజాగా దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. మరోవైపు వైఎస్‌ విజయమ్మను పోలీసులు […]

  • Publish Date - November 29, 2022 / 12:06 PM IST

విధాత‌: వైఎస్‌ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. సీఎం కేసీఆర్‌, రాజకీయ, మతపరమైన అంశాలపై రెచ్చగొట్టే మాట‌లు మాట్లాడవద్దని కోర్టు హెచ్చ‌రించింది.

సర్సంపేట పోలీసులు షర్మిల పాదయాత్రకు అనుమతి రద్దు చేశారని, అనుమతి ఇవ్వాలని వైఎస్‌ఆర్‌టీపీ సభ్యుడు రవీంద్రనాథ్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాదయాత్రకు ఆటంకాలు సృష్టించారని పిటిషనర్‌ పేర్కొన్నారు.

పాదయాత్ర కోసం తాజాగా దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. మరోవైపు వైఎస్‌ విజయమ్మను పోలీసులు గృహనిర్బంధం చేశారు. షర్మిలను పరామర్శించేందుకు వెళ్లడానికి విజయమ్మ యత్నిస్తున్నారు. ఆమె పీఎస్‌కు వెళ్లకుండా గృహనిర్బంధం చేశారు. దీంతో విజయమ్మ ఇంట్లోనే తన నిరసన తెలుపుతున్నారు.