Gutta Sukhender Reddy
విధాత: రెండువేల రూపాయల నోట్ల రద్దుతో ప్రధాని మోడీ ప్రభుత్వం మరోసారి తుగ్లక్ చర్యకు పాల్పడిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకోవడం కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమన్నారు.
మోడీ ప్రభుత్వం తుగ్లక్ పాలనను గుర్తు చేస్తుందన్నారు. గతంలో నోట్లను రద్దు చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టిన కేంద్ర ప్రభుత్వం మరోసారి ఇబ్బందులు పెట్టె పనులు చేస్తోందన్నారు.
అసలు 2000 నోట్లను ఎందుకు ఉపసంహరణ చేశారో సమాధానం చెప్పాలన్నారు.
ఇందులో కేంద్ర ప్రభుత్వ రహస్య ఎజెండా ఉందని, మోడీ ఆయన సన్నిహితులకు లాభం చేకూర్చాలని ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. బిజెపి ప్రభుత్వంపైన ప్రజలకు విశ్వాసం లేదని, మోడీ ప్రధాన మంత్రిగా ప్రజల కోసం కాకుండా కేవలం కార్పొరేట్ దోస్తుల కోసం పని చేస్తున్నారన్నారు. కేసీఆర్ నాయకత్వమే దేశానికి, రాష్ట్రానికి శ్రీ రామ రక్ష అన్నారు.