Site icon vidhaatha

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమం రద్దు చేయడం శోచనీయం

విధాత‌: అన్ని వృత్తులను సృష్టించే బ్రాహ్మ ఉపాధ్యాయుడు,అలాంటి ఉపాధ్యాయులను గౌరవించే రోజు ఉపాద్యాయ దినోత్సవం, ఆ రోజున రాష్ట్రములో ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి గౌరవించడం అనాదిగా వస్తున్న ఆచారం,అలాంటిది ఈ సంవత్సరం అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానించి వేడుకలు రద్దు చేయడం కడు బాధాకరం. పాఠశాల నిర్వహణకు,జాతీయ వేడుకల నిర్వహణకు, పాఠశాలల్లో పేరెంట్ కమిటీ ఎన్నికలకు లేని నిబంధనలు ఉపాద్యాయ దినోత్సవం నకు చూపడం సమర్థనీయం కాదు, ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు కనీసం అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజున వర్చువల్ విధానంలో జరపాలి అని ఫోర్టో ( ఉపాద్యాయ సంఘాల సమన్వయ వేదిక) రాష్ట్ర అధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి, చైర్మన్ కరణం హరికృష్ణ, సెక్రటరీ జనరల్ సామల సింహాచలం ,మీడియా కన్వీనర్ గరికపాటి సురేష్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Exit mobile version