Viral Video | ఈ కాలంలో చీర( Saree ) కట్టుకొని నడిచేందుకు చాలా మంది యువతులు, మహిళలు( Womens )ఇబ్బంది పడుతుంటారు. కానీ ఈ మహిళలు మాత్రం చీరలు ధరించి ఫుట్ బాల్( Foot Ball )అద్భుతంగా ఆడారు. కాళ్లకు స్నీకర్స్ ధరించి.. గోల్ కొట్టేందుకు పరుగులు తీస్తూ అదరగొట్టేశారు. ఈ మహిళల ఫుట్ బాల్ మ్యాచ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
మధ్యప్రదేశ్( Madhya Pradesh )లోని గ్వాలియర్( Gwalior ) నగరంలోని ఎమ్ఎల్‌బీ గ్రౌండ్‌లో గోల్ ఇన్ శారీ( Goal in Saree )అనే ఫుట్ బాల్ టోర్నీని రెండు రోజుల పాటు నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. ఈ మ్యాచ్‌లో పాల్గొన్న మహిళలంతా 25 నుంచి 50 ఏండ్ల వయసున్న వారే. అయితే ఆయా జట్లు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ బంతిని గోల్ దిశగా పరుగెత్తించారు.
చీరకట్టులోనూ తమ నైపుణ్యంతో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ టోర్నీని నిర్వహించిన కన్వీనర్ అంజలి బాత్రా మాట్లాడుతూ.. మహిళలు చీరకట్టులో ఫుట్‌బాల్ ఆడటం చూసి ప్రేక్షకులు థ్రిల్లింగ్‌గా ఫీల్ అయ్యారని తెలిపారు. ఇక టోర్నమెంట్‌కు వ్యాఖ్యాతగా గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కిశోర్ కన్యల్ వ్యవహరించారు.