విధాత: ఏదైనా కార్యక్రమం ప్రారంభించినప్పుడు పటాకులు కాల్చడం సహజమే. అయితే ఓ స్పోర్ట్స్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో కూడా పటాకులు కాల్చారు. పటాకులకు నిప్పంటించిన ఓ ఎమ్మెల్యే భయంతో పరుగులు తీశారు.
ఇంకేముంది.. ఆ ఎమ్మెల్యే బొక్క బోర్లా పడ్డాడు. అక్కడున్న వారంతా పగలబడి నవ్వారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. బీహార్ సోనేపూర్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే వినయ్ కుమార్.. ఫుట్ బాల్ మ్యాచ్ టోర్నమెంట్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పటాకులకు కాల్చారు. పటాకులకు నిప్పంటించిన సదరు ఎమ్మెల్యే భయంతో పరుగులు తీశారు. అదుపు తప్పడంతో.. వినయ్ కుమార్ బొక్క బోర్లా పడ్డారు. అక్కడున్న నాయకులు, కార్యకర్తలు పగలబడి నవ్వారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేకు ఎలాంటి గాయాలు సంభవించలేదు. వినయ్ కుమార్ కు ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.