Site icon vidhaatha

H3N2 | ప్రాణాంతకంగా ఇన్‌ఫ్లుఎంజా..! అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర ఆరోగ్యశాఖ..!

H3N2 | H3N2 ఇన్‌ఫ్లుఎంజా దేశంలో ప్రాణాంతకంగా మారుతున్నది. హర్యానా, కర్నాటకలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఇన్‌ఫెక్షన్‌ పెరుగుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ రాష్ట్రాలను ఆదేశించారు. కేంద్రం తరఫున అన్ని విధాలా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. మరో వైపు హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుఎంజా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎంపవర్డ్ గ్రూప్, కోవిడ్-19 (NEGVAC) కోసం వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్‌పై నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ప్రత్యేకంగా సమావేశమైంది.

సవాల్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు బృందం స్పష్టం చేసింది. కోవిడ్‌ తరహాలోనే ఇన్‌ఫ్లుఎంజాను నివారింవచ్చని పేర్కొన్నారు. లక్షల మంది సీజనల్‌ ఫ్లూ బారినపడే అవకాశం అందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, యువకులు, పిల్లలు, వృద్ధులు సహా ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని పేర్కొంటున్నారు. అయితే, డిసెంబర్‌ నుంచి సీజనల్‌ ఇన్‌ఫ్లుఎంజా కేసులు రికార్డవుతున్నాయి. క్రమంగా H3N2 సంక్రమణ పెరుగుతున్నట్లు తెలుస్తున్నది. అయితే, మార్చి చివరి నాటికి వైరస్‌ తగ్గుతుందని మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

H3N2 కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన Oseltamivir అనే మందును ఉచితంగా అందిస్తుంది. రాష్ట్రాల వద్ద ఈ మెడిసిన్‌ స్టాక్‌ అవసరమైన మేరకు ఉందని, సీజనల్ ఇన్‌ఫ్లుఎంజా పరిస్థితిని రియల్ టైమ్ ప్రాతిపదికన ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) నెట్‌వర్క్ ద్వారా నిశితంగా పరిశీలిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. సీజనల్ ఇన్‌ఫ్లుఎంజా తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌. ఇది ఇన్‌ఫ్లుఎంజా వైరస్‌ వల్ల వస్తుంది. భారతదేశంలో జనవరి నుంచి మార్చి వరకు.. ఆ తర్వాత రుతుపవనాల కేసులు పెరుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. మరో వైపు ఎన్‌ఫ్లుఎంజా ఉధృతి నేపథ్యంలో రాష్ట్రాలతో నీతి ఆయోగ్‌ సమావేశం నిర్వహించనున్నది.

Exit mobile version