Site icon vidhaatha

Hanumakonda: కూతురికి విషమిచ్చి తల్లి ఆత్మహత్య.. తరాలపల్లిలో విషాదం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కూతురికి విషమిచ్చి తాను ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన వరంగల్ నగర శివారు తరాల పల్లి గ్రామంలో బుధవారం జరిగింది.

ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామంలో ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన వివాహిత ఈరబోయిన అనిత నాలుగేళ్ల త‌న కూతురికి విషమిచ్చి చంపి తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

కుటుంబ కలహాలే ఇందుకు కారణమని గ్రామస్తులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version