Ram Charan: మెగాస్టార్ చిరంజీవి తనయుడు.. గ్లోబల్ స్టార్ రామచరణ మైనపు విగ్రహవం లండన్ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. మే 9న లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని శాశ్వతంగా సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియంకు తరలిస్తారు. రామ్ చరణ్‌కి ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా రామ్ చరణ్‌తో పాటు ఆయన పెట్ డాగ్ రైమ్‌లకు సంబంధించిన కొలతలు, ఫోటోలు, వీడియోలు తీసుకుని ఈ మైనపు బొమ్మను శరవేగంగా తయారు చేశారు. ఇప్పటికే మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో మహేశ్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ మైనపు విగ్రహాలు ఉండటం విశేషం.
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ తన స్వశక్తితో గ్లోబల్ స్టార్‌గా మారాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ మరింతగా పెరిగింది. ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్నాడు చెర్రీ. ఇటీవల క్రికెట్ మ్యాచ్ లో బ్యాటింగ్ షాట్ తో విడుదల చేసిన పెద్ది సినిమా గ్లింప్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచింది.మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో పెద్ది సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు, సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.