విధాత : ఎన్నో ఆశలతో లండన్ వెళ్లిన కొడుకు గుండె పోటుతో మృతి చెందడం తల్లిదండ్రులను తీవ్ర విషాదానికి గురి చేసింది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన ఏనుగు మహేందర్ రెడ్డి (26) లండన్ లో గుండెపోటుతో మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం రెండేళ్ల కిందట లండన్ వెళ్లిన మహేందర్ రెడ్డి అక్కడే పీజీ పూర్తి చేసి ఉద్యోగం కూడా సంపాదించాడు. వర్క్ వీసా కూడా రావడంతో తమ కొడుకు సెటిల్ అయిపోయాడని తల్లిదండ్రులు సంతోషపడ్డారు. కానీ ఇంతలోనే కొడుకు మరణవార్త వారిని తీవ్ర విషాదంలో ముంచేసింది.
అక్టోబర్ 3న గుండెపోటుతో మహేందర్ రెడ్డి మృతి చెందగా..మరణవార్తను అతని స్నేహితులు ఫోన్ చేసి తల్లిదండ్రులకు తెలిపారు. కొడుకు మరణ సమాచారంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మహేందర్ రెడ్డి తండ్రి రమేశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మేడిపల్లి మండల అధ్యక్షునిగా ఉన్నారు.