Site icon vidhaatha

Janhvi Kapoor: లండన్ వీధుల్లో ప్రియుడుతో జాన్వీ కపూర్ !

Janhvi Kapoor : బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ నిజజీవితం ప్రేమకథ మరోసారి వైరల్ అయ్యింది. జాన్వీ తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి లండన్ వీధుల్లో చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగిన వీడియో వైరల్ గా మారింది. ఈ జంట లండన్ వీధుల్లో ఒకరి చేతిలో మరొకరు చేయి వేసి నడుస్తూ రొమాంటిక్‌గా కనిపించారు. జాన్వీకపూర్ తన ప్రియుడు శిఖర్ పహారియా చేతిలో చేయి వేసి నడుస్తుండగా..పక్కే ఆమె చెల్లెలు ఖుషీ కపూర్ కూడా ఉన్నారు. జాన్వీ కొన్ని నెలలుగా శిఖర్ తో డేటింగ్ చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలకు తాజా లండన్ వీడియో మరింత బలం చేకూర్చింది. రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి తీసిన ఈ వీడియోలో జాన్వీ నవ్వుతూ శిఖర్‌తో చేతులు కలిపి నడవడం కనిపించింది. జాన్వీ, శిఖర్ లు ఇప్పటివరకైతే తమ రిలేషన్ షిప్ ను అధికారికంగా దృవీకరించలేదు. శిఖర్ తన సోషల్ మీడియాలో జాన్వీ ఫొటోలను షేర్ చేస్తుంటాడు.ఇటీవల జాన్వీ తన రాబోయే సినిమా హోమ్‌బౌండ్ ప్రీమియర్ కోసం కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లినప్పుడు శిఖర్ ఆమెతో కనిపించాడు.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న జాన్వీకపూర్ తాజాగా సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి పరం సుందరి అనే రొమాంటిక్ కామెడీ మూవీలో కనిపించనుంది. కేరళ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా జులై 25న విడుదలవుతుంది. అలాగే, వరుణ్ ధవన్‌తో కలిసి కరణ్ జోహార్ నిర్మించిన సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారీ అనే ఫ్యామిలీ రోమ్-కామ్‌లోనూ నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది.
అంతేకాదు జాన్వీ కపూర్ దేవర తర్వాతా తెలుగులో రెండో సినిమాగా రామ్ చరణ్‌తో కలిసి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న స్పోర్ట్స్-యాక్షన్ సినిమా పెద్దిలో నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ 2026లో విడుదల కానుంది.

 

Exit mobile version