మ్యాడ్ ఫేం అనంతిక సనీల్‌కుమార్ (Ananthika Sanilkumar) కీలక పాత్రలో రూపొందుతున్న ఎమోషనల్ లవ్ స్టోరీ ‘8 వసంతాలు’ (8 Vasantalu). ప్రఖ్యాత టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఈ మూవీని నిర్మించగా ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narsetti) దర్శకత్వం వహించాడు.
సుమంత్, రవితేజ దుగ్గిరాల ప్రధాన పాత్రల్లో నటించారు. సోల్ ఫుల్ నెంబర్స్ కి పాపులరైన హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించాడు. తాజాగా ఈ చిత్రం నుంచి లవ్ మెలోడీ ‘అందమా అందమా’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. వనమాలి సాహిత్యం అందించిన ఈ పాటను హేషమ్ అబ్దుల్ ఆలపించారు.