Hydrabad
విధాత: బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ఇవాళ, రేపు వైన్స్ షాపులు.. బార్ లు బంద్ కానున్నాయి.
సికింద్రాబాద్ పరిధిలో నేడు, రేపు గాంధీనగర్, చిలకలగూడ, లాలాగూడ, వారసిగూడ, బేగంపేట, బోయిన్ పల్లి, మహంకాళి పిఎస్, మార్కెట్ పిఎస్, తిరుమలగిరి, బొల్లారం తదితర ప్రాంతాల్లో వైన్సులు.. బార్లు మూసివేయనున్నట్లుగా ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు వైన్స్ లు, బార్ లు బంద్ ఉంటాయని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.