Site icon vidhaatha

ఎగ్జామ్‌ పాస్ కావాలంటే.. నా గ‌ర్ల్ ఫ్రెండ్‌గా మారాల్సిందే..

Uttar Pradesh | ఎగ్జామ్‌లో పాస్ కావాలంటే.. నువ్వు నా గ‌ర్ల్ ఫ్రెండ్‌గా మారాల‌ని ఓ లెక్చ‌ర‌ర్ ప్ర‌తిపాద‌న తీసుకొచ్చాడు. ఈ విచిత్ర ప్ర‌తిపాద‌న‌ను స‌ద‌రు స్టూడెంట్ తిర‌స్క‌రించింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌లో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌హారాజ్‌పుర పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ఓ గ్రామానికి చెందిన యువ‌తి.. కాన్పూర్‌లోని ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా చ‌దువుతోంది. డిప్లొమా ఫ‌లితాలు ఇటీవ‌లే విడుద‌ల కాగా, ఆమె గ‌ణితం స‌బ్జెక్టులో ఫెయిల్ అయింది. కేవ‌లం 11 మార్కుల మాత్ర‌మే వ‌చ్చాయి.

దీంతో బాధిత స్టూడెంట్ రీకౌంటింగ్‌కు డ‌బ్బులు క‌ట్టింది. న‌వంబ‌ర్ నెల‌లో ఆమె మొబైల్‌కు ఓ మేసేజ్ వ‌చ్చింది. నువ్వు నా గ‌ర్ల్ ఫ్రెండ్‌గా మారితే ఎగ్జామ్ లో పాస్ చేస్తాన‌ని ఆ సందేశంలో ఉంది. అంతేకాదు రూ.5 వేలు కూడా ఇవ్వాల‌ని డిమాండ్ చేశాడు. అందుకు ఆ యువ‌తి తిర‌స్క‌రించింది. రీ కౌంటింగ్ ఫ‌లితాల‌ను చూసుకునే స‌రికి ఆ యువ‌తి మ‌ళ్లీ ఫెయిల్ అయింది.

చేసేదేమీ లేక బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. త‌ర‌చూ త‌న‌కు కాల్స్ చేసి వేధిస్తున్న ఆ లెక్చ‌ర‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె డిమాండ్ చేసింది. విద్యార్థినిని వేధింపులకు గురి చేసిన ఆ వ్య‌క్తి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Exit mobile version