IMD | దక్షిణాదికి తక్కువ వానలు.. హిమాలయాలకు అధిక వర్షాలు

IMD | రెండు నెలలూ తక్కువ వానలే వెల్లడించిన వాతావరణ కేంద్రం విధాత: నైరుతి రుతుపవనాల సీజన్‌ రెండవ అర్థభాగమైన ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో దక్షిణాధిలో తక్కువ వానలు, హిమాలయాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని భారతీయ వాతావరణ కేంద్రం(ఐఎండీ) తెలిపింది. దేశంలో మిగిలిన రాష్ట్రాల కంటే తెలంగాణలోనే అతి తక్కువ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ చిత్ర పటం ద్వారా తెలియ జేసింది. ముఖ్యంగా రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో […]

  • Publish Date - July 31, 2023 / 04:38 PM IST

IMD |

  • రెండు నెలలూ తక్కువ వానలే
  • వెల్లడించిన వాతావరణ కేంద్రం

విధాత: నైరుతి రుతుపవనాల సీజన్‌ రెండవ అర్థభాగమైన ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో దక్షిణాధిలో తక్కువ వానలు, హిమాలయాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని భారతీయ వాతావరణ కేంద్రం(ఐఎండీ) తెలిపింది. దేశంలో మిగిలిన రాష్ట్రాల కంటే తెలంగాణలోనే అతి తక్కువ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ చిత్ర పటం ద్వారా తెలియ జేసింది.

ముఖ్యంగా రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు ఏపీలోని రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షం కురుస్తుందని స్పష్టం చేసింది. ఆగస్టు నెలలో దక్షిణ ద్వీప కల్పంలోని చాలా ప్రాంతాలు, వాయువ్య మధ్య భారత దేశంలోని పశ్చిమ భాగాలలో తక్కువ వర్ష పాతం నమోదు అవుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే హిమాలయాలకు ఆనుకొని ఉన్న తూర్పు మధ్య, తూర్పు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురుస్తుందని వెల్లడించింది.

హైదరాబాద్‌లో దంచి కొట్టిన వర్షం-ట్రాఫిక్‌ జాం

గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా నగర వ్యాప్తంగా వర్షం కురిసింది. అరగంటలో 2నుంచి 3 సెంటీ మీటర్ల మధ్య వర్షం కురిసింది. దీంతో రోడ్లపై వర్షం నీరు వరదలై పారింది. ఖైరతాబాద్‌, లక్డికాపూల్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, ఆబిడ్స్‌, సికింద్రాబాద్‌, అమీర్‌పేట, బంజారాహిల్స్‌, మాధాపూర్‌, హెటెక్‌ సిటీ, కూకట్‌పల్లి తదితర ప్రంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

Latest News