Downpours Himalayan Cities | ఉత్తర భారతదేశం, పాకిస్తాన్‌లోని హిమాలయ (Himalayas) ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు జన జీవితాన్ని అల్లకల్లోలం చేశాయి. వీటి ప్రభావంతో అనేక నగరాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. అనేక ఇళ్లల్లోకి నీరు చేరింది. రహదారులు జలమయం అయ్యాయి. ఈ ప్రాంతాల్లోని ప్రధాన నదులు వరద నీటితో పోటెత్తుతున్నాయి. గురువారం తర్వాత భారీ వర్షాల నుంచి కొంత ఉపశమనం ఉంటుందని భారత వాతావరణ విభాగం అధికారులు (weather officials) చెబుతున్నారు. కానీ.. పాకిస్తాన్(Pakistan)లో మాత్రం పరిస్థితి తీవ్ర సెప్టెంబర్ 9వ తేదీ (September 9) వరకూ కొనసాగే అవకాశాలు ఉన్నట్టు అక్కడి అధికారులు ప్రకటించారు.
ఈ సీజన్‌లో పెను విధ్వంసం
ఈ ఏడాది వర్షాకాల సీజన్ పెను విధ్వంసం (immense destruction) సృష్టించింది. ఒక్క ఆగస్ట్ నెలలోనే పాకిస్తాన్‌లో వర్షాల సంబంధిత ఘటనల్లో 880 మంది చనిపోగా, భారత్‌లో సుమారు 150 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. కుండపోత వర్షాలతో భారతదేశంలోని అనేక నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అధికారులు వివిధ డ్యామ్‌ల నుంచి భారీ మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల్లో ఉభయ దేశాల సరిహద్దు ప్రాంతాల వరద ముంపులో చిక్కుకున్నాయి.
24 గంటల్లో ఏడు హెచ్చరికలు
భారతదేశం నుంచి ప్రారంభమయ్యే పలు నదులు.. పాకిస్తాన్ మీదుగా వెళుతుంటాయి. డ్యాములు తెరుస్తున్నట్టు గడిచిన 24 గంటల వ్యవధిలో మూడు సహా మొత్తం ఏడు హెచ్చరికలు న్యూఢిల్లీ అధికారులు చేసినట్టు పాకిస్తాన్ పేర్కొన్నది. భారత ఆనకట్టల నుంచి భారీ స్థాయిలో నీరు విడుదల చేస్తుండటంతో పాకిస్తాన్‌మీదుగా ప్రవహించే మూడు నెలల్లో ప్రవాహం ఉధృత స్థాయిలో ఉన్నది. ఎగువన భారతదేశం డ్యామ్‌లు తెరవడంతో పాకిస్తాన్‌లోని మూడు నదులకు పెద్ద ఎత్తున వరద వచ్చినట్టు అక్కడి ప్రొవిన్షియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ డైరెక్టర్ జనరల్ ఇర్ఫాన్ అలీ ఖాతియా రాయిటర్స్‌కు చెప్పారు.
దెబ్బతిన్న రెండు దేశాల ధాన్యాగారాలు
- భారత్, పాకిస్తాన్ దేశాల్లో ‘ధన్యాగారాలు’గా పేర్గాంచిన ఒకే పేరుతో ఉన్న పంజాబ్ రాష్ట్రాలు సరిహద్దు రేఖకు అటు ఇటూ ఉన్నాయి. ఈ ఏడాది వరదలకు ఇవి తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
భారతదేశంలోని పంజాబ్‌లో ఆగస్ట్ నెల ప్రారంభం నుంచి 37 మంది వర్ష సంబంధ ఘటనల్లో చనిపోయారు.
వర్షాలతో వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి.
వరద సహాయ చర్యలకోసం 71 కోట్ల రూపాయలను విడుదల చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. - పంజాబ్‌లోని దాదాపు 23 జిల్లాలూ ప్రభావితమయ్యాయి.
అటు పాకిస్తాన్ పంజాబ్‌లో ఇటీవలి వారాల్లో సుమారు 18 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారు.
దాదాపు 3.900 గ్రామాలు నీట మునిగాయి.
చారిత్రాత్మక ముల్తాన్‌కు తప్పిన వరద ముప్పు
- పాకిస్తాన్‌లో చారిత్రక నగరమైన ముల్తాన్‌ను వరద ముప్పు నుంచి రక్షించినట్టు అక్కడి అధికారులు ప్రకటించారు.
- చీనాబ్ నది ఒడ్డుకు కోత పెట్టి.. తద్వారా వరద నీరు నగర శివార్లలోకి వెళ్లేలా చేయడంతో నది కొంత శాంతించింది.
ఢిల్లీలో యుమున ఉగ్రరూపం
- భారతదేశంలోని ఢిల్లీ నగరంలో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉన్నదని కేంద్ర జల సంఘం ప్రకటించింది.
గురువారం మురికి నీళ్లు లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి ప్రవేశించాయి. - అటువంటి ప్రాంతాల నుంచి ఇప్పటికే ప్రభుత్వ అధికారులు వేల మందిని ముందు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
- ఢిల్లీ ఓల్డ్ సిటీలో యమునా నదిపై ఉన్న చారిత్రాత్మక లోహ పూల్ (ఐరన్ బ్రిడ్జ్)పై రాకపోకలను అధికారులు నిలిపివేశారు.
- చారిత్రాత్మక ఎర్రకోట చుట్టు పక్కల జలమయమైన మార్గాల్లోనే అనేక మంది వినాయకుడి విగ్రహాలను తీసుకుపోవడం కనిపించింది.
ప్రమాదకరంగా ఝీలం
- జమ్ముకశ్మీర్ వేసవి రాజధాని అయిన శ్రీనగర్‌లో ఝీలం నది ఒడ్డు కోతకు గురికావడంతో సమీప బడగామ్ ప్రాంతంలోని 9వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
- ఝీలం నదిలో నీటి మట్టం పెరుగుతున్నప్పటికీ.. అది అంత వేగంగా లేదని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎక్స్‌లో పేర్కొన్నారు.
- అయినా పూర్తి అప్రమత్తతో ఉండి పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు.
- డ్రాబ్షల్లాలోని చీనాబ్ నదిపై నిర్మించిన జల విద్యుత్ కేంద్రం వద్ద కొండచరియలు విరిగి పడ్డాయి.
- వాటికింద ఎవరైనా చిక్కుకొని ఉంటారన్న అనుమానంతో సహాయ బృందాలు వెతుకుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
కవిత ఎఫెక్ట్…మాజీ ఎంపీ సంతోష్ రావు పై నేరెళ్ల బాధితుల ఫిర్యాదు
Gmail Security Alert | జీమెయిల్ వినియోగదారులకు గూగుల్ హ్యాకింగ్ హెచ్చరిక?– నిజం ఏమిటి?
Bhupalpally : ప్రియుడితో కలిసి భర్త, కుమార్తెల హత్య
Bet Turns Tragic| రూ.500కోసం యమునాలో దూకి గల్లంతు!