Site icon vidhaatha

కవిత ఎఫెక్ట్…మాజీ ఎంపీ సంతోష్ రావు పై నేరెళ్ల బాధితుల ఫిర్యాదు

Santosh Rao

విధాత, హైదరాబాద్ : మాజీ బీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుపై కేసు నమోదు చేయాలని నేరెళ్ల బాధితులు తంగళ్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంతోష్ రావు ప్రోద్బలంతోనే పోలీసులు తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు కవిత ప్రెస్ మీట్ లో చెప్పిన అంశాలను వారు ప్రస్తావించారు.

సంతోష్ రావు చెబితేనే పోలీసులు తమను కొట్టారని..ఆనాడు మాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని..అక్రమ కేసులు పెట్టారని కవిత ప్రెస్ మీట్ లో వెల్లడించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కవిత వ్యాఖ్యల ఆధారంగా సంతోష్ రావుపైన, అప్పటి ఐపీఎస్ కంపాటి విశ్వజిత్, ఎస్సై రవిందర్ లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Exit mobile version