న్యూఢిల్లీ : నేపాల్ (Nepal)లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో మంచు తుపాన్ బీభత్సానికి ఏడుగురు పర్వాతారోహకులు(seven climbers dead) మృతి చెందారు. నేపాల్ లోని 18,471మీటర్ల యాలంగ్ రి పర్వతాన్ని(Yalung Ri mountain) అధిరోహిస్తుండగా ఒక్కసారిగా మంచు తుపాన్ విరుచకపడింది. అనూహ్య హిమపాతానికి పర్వాతారోహక బృందంలోని 15 మందిలో ఏడుగురు మృతి చెందారు. మరో నలుగురు గల్లంతయ్యారు.
మృతుల్లో ముగ్గురు ఫ్రెంచ్ అధిరోహకులు, ఒక కెనెడియన్, ఒక ఇటాలియన్, ఇద్దరు నేపాలీలు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది, హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపట్టారు.
