Amarnath Yatra | హిందూ మతాన్ని( Hindu Religion ) విశ్వసించే ప్రతి ఒక్కరూ ఆ పరమేశ్వరుడిని( Lord Parameshwara ) ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ నీలకంఠుడిని ఆరాధించే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా అమర్‌నాథ్ యాత్ర( Amarnath Yatra )చేయాలని అనుకుంటారు. హిమాలయాల్లోని( Himalayas ) అమర్‌నాథ్ గుహల్లో( Amarnath Caves ) మంచు రూపంలో కొలువైన కైలాసనాథుడిని దర్శించుకోవాలని ఆ మంజునాథ భక్తులు( Lord Parameshwara Devotees ) తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ వెళ్తారు.
అయితే ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర( Amarnath Yatra ) జులై 3వ తేదీన ప్రారంభమై.. ఆగస్టు 9వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 24వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాలనే ఆసక్తి ఉన్న భక్తులు అమర్‌నాథ్ బోర్డ్( Amarnath Board ) అధికారిక వెబ్‌సైట్‌లో లేదా దేశవ్యాప్తంగా ఉండే పలు బ్యాంకు శాఖల్లో తగిన రుసుము చెల్లించి తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
దక్షిణ కాశ్మీర్( South Kashmir )లోని హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తులో ఉండే అమర్‌నాథ్ క్షేత్రం గురించి ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలెన్నో అలానే ఉండిపోయాయి. ఎంత టెక్నాలజీ పెరిగినా.. వాటి గురించి తెలుసుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఎవ్వరికీ సాధ్యపడలే. ఈ సందర్భంగా అమర్‌నాథ్ యాత్ర( Amarnath Yatra )గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
అమర్‌నాథ్ కథ( Amarnath Story ) ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ సృష్టికి రహస్యం ఏంటని పార్వతీదేవి( Parvathi Devi ) శివుడిని( Lord Shiva ) అడుగుతుందట. ఈ సృష్టి ఎలా ఏర్పడింది. ఈ సృష్టికి మూలం ఏంటని..? ఎక్కడంటే అక్కడ అంత తేలికగా చెప్పొద్దని చెప్పి పార్వతీ దేవిని శివుడు అమర్‌నాథ్( Amarnath )కు తీసుకెళ్లి రహస్యం చెప్తాడట. గణేషుడిని( Lord Ganesh ) కూడా పార్వతీపరమేశ్వరుడు తమ వెంట తీసుకెళ్తారట.
నందీశ్వరుడిని పహల్గాం వద్ద వదిలేస్తాడట..
అమర్‌నాథ్ వెళ్లే మార్గంలో పహల్గాం( Pahalgam ), గణేశ్ చౌక్( Ganesh Chowk ), శేషు నాగ్( Shesh Nag ), చాందినీ చౌక్( Chandini Chowk ) ఉంటాయి. ఈ నాలుగింటికి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక అమర్‌నాథ్ యాత్ర( Amarnath Yatra )లో భాగంగా శివపార్వతులు, గణేశుడు నందీశ్వరుడి మీద వెళ్తూ.. పహల్గాం వద్దకు చేరుకుంటారట. అయితే శివుడు నందీశ్వరుడిని పహల్గాం వద్ద వదిలేస్తాడట. అందుకే గుర్తుగా అక్కడ నంది బొమ్మను దానంగా ఇవ్వమని చెబుతారు. అది ఆచారం.
సృష్టి రహస్యం ఏంటని అడిగితే.. శివుడేమో ఒక్కొక్కటి వదిలేస్తున్నాడని..
ఇక చాందీని చౌక్ వద్ద తన శిరస్సుపై ఉన్న చంద్రుడిని శివుడు వదిలేస్తాడట. సృష్టి రహస్యం ఏంటని అడిగితే.. శివుడేమో ఒక్కొక్కటి వదిలేస్తున్నాడని పార్వతీదేవి ఆశ్చర్యం వ్యక్తం చేస్తుందట. ఇక్కడ్నేమో వెండి చంద్రరేఖలను దానం చేయిస్తారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే గణేశ్ చౌక్ అని వస్తుంది. ఇక నువ్వు రాలేవని అక్కడ గణేశుడిని వదిలేస్తారట. అక్కడ గణేశ్ ప్రతిమలను దానం చేయిస్తారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే శేష్ నాగ్ వస్తుంది. అక్కడ మెడలో ఉండే పాము( Snake )ను విడిచి పెడుతాడట. అందుకే గుర్తుగా అక్కడ పాము బొమ్మలను దానం చేయిస్తారు.
ఇక మిగిలింది ఇద్దరే శివపార్వతులు..
ఇక మిగిలింది ఇద్దరే శివపార్వతులు.. ఇద్దరూ కలిసి అమర్‌నాథ్ గుహలోకి( Amarnath Caves ) వెళ్తారట. అయితే ఆశ్చర్యం ఏంటంటే.. గుహలోకి వెళ్లాక ఏం జరిగిందో తెలియదు. అక్కడ మంచు శివలింగం( Shivalingam ) ఉంది అంతే. మంచు కరిగి కరిగి శివలింగంగా రూపొందింది. అక్కడేం నిజమైన శివలింగం ఉండదు. కాబట్టి వర్షకాలంలోనే అమర్‌నాథ్ యాత్ర ఉంటుంది. వేసవి కాలం వచ్చిందంటే యాత్ర ఉండదు అని పండితులు చెబుతున్నారు.
అమర్‌నాథ్ గుహల్లో రహస్యం ఏంటంటే..
ఇక ఇప్పటికీ అక్కడ రెండు చిలుకలు( Parrots ) ఉంటాయని అంటారు. ఆ రెండు చిలుకలే శివపార్వతులు అని భక్తులు భావిస్తారు. వారి రహస్యం అవి విన్నాయి కాబట్టి అవి అలానే ఉన్నాయని అంటారు. అక్కడ రహస్యం ఏంటంటే పార్వతి శివుడిలో కలిసిపోయింది. ఇద్దరూ ఒక్కటయ్యారు అది రహస్యం. అక్కడ మంచు రూపంలో శివుడు లింగం అయ్యాడు అది రహస్యం అని పండితులు పేర్కొంటున్నారు.
ఆ నాలుగింటిని వదిలేయడానికి సంకేతం ఇదే..
నందిని వదిలేయడం అంటే.. వాహనాల మీద వ్యామోహం వదిలేయాలని. చంద్రుడిని వదిలేడయం అంటే ఆభరణాల మీద వ్యామోహం వదులుకోమని. గణేశుడిని వదిలేశాడంటే.. పుత్రులు, పుత్రికలు అంటే సంతానం మీద పూర్తిగా వ్యామోహం వదిలేయమని, శేష్ నాగ్ వద్ద పామును వదిలేశాడు.. ఇది దేనికి సంకేతం అంటే.. భయాన్ని వదిలేయమని. అంటే భయం లేకుండా ధైర్యంగా ఉండమని శివుడు నేర్పించాడని పండితులు చెబుతున్నారు. చివరకు పార్వతీ శివుడు కలిసి పోయారంటే.. ప్రకృతి పురుషుడు ఒక్కటి అని అర్థం.