Revanth Reddy | ‘ఇండియా’ విజయానికి తెలంగాణలో వ్యూహం: రేవంత్ రెడ్డి

Revanth Reddy | జాతీయ రాజకీయాలపై సీడబ్ల్యూసీలో చర్చ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికపైనా చర్చలు సమావేశాలను విజయవంతం చేస్తాం విధాత‌, హైద‌రాబాద్‌: ఇండియా కూటమి గెలవడానికి వ్యూహం తెలంగాణలో రూపొందుతుందని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. 17న జ‌ర‌గ‌బోయే సీడబ్ల్యూసీ స‌మావేశాల్లో రాష్ట్ర రాజకీయాలు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక అంశాలపై చర్చ జరుగుతుందని తెలిపారు. జాతీయ రాజకీయాలపై చర్చకు వేదిక కానుందని అన్నారు. ఈ స‌మావేశాల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు, […]

  • Publish Date - September 4, 2023 / 02:34 PM IST

Revanth Reddy |

  • జాతీయ రాజకీయాలపై సీడబ్ల్యూసీలో చర్చ
  • ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికపైనా చర్చలు
  • సమావేశాలను విజయవంతం చేస్తాం

విధాత‌, హైద‌రాబాద్‌: ఇండియా కూటమి గెలవడానికి వ్యూహం తెలంగాణలో రూపొందుతుందని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. 17న జ‌ర‌గ‌బోయే సీడబ్ల్యూసీ స‌మావేశాల్లో రాష్ట్ర రాజకీయాలు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక అంశాలపై చర్చ జరుగుతుందని తెలిపారు.

జాతీయ రాజకీయాలపై చర్చకు వేదిక కానుందని అన్నారు. ఈ స‌మావేశాల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు, పొత్తులు, వ్యూహాలు, కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

సీడబ్ల్యూసీ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించాలన్న తమ లేఖకు సానుకూలంగా స్పందించిన ఏఐసీసీ నాయకత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అధిష్ఠానం తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని వెల్లడించారు.

కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే హైదరాబాద్ రాష్ట్రం వ్యక్తి అని తెలిపారు. రజాకార్ల చేతిలో ఖర్గే కుటుంబం చనిపోయిందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కార్యక్రమం నిర్వహిస్తామ‌ని రేవంత్ వెల్ల‌డించారు.

Latest News