విధాత: మన దేశంలోని మందుబాబులందరికీ మత్తెక్కించే ఘటన తాజాగా జరిగింది. 2023 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యంత మంచి విస్కీ బ్రాండ్ (Best Whisky Brand) గా భారత్‌కు చెందిన ఇంద్రీ విస్కీ చోటు దక్కించుకుంది. 2023 విస్కీస్ ఆఫ్ ద వరల్డ్ అవార్డ్స్‌లో బెస్ట్ ఇన్ షో, డబుల్ గోల్డ్ పురస్కారం ఇంద్రీ బ్రాండ్‌ను వరించింది.
స్కాచ్, బర్బన్, కెనడియన్, ఆస్ట్రేలియన్, బ్రిటిష్ దేశాలకు చెందిన సుమారు 100 అంతర్జాతీయ సంస్థలను తోసిరాజని భారతీయ బ్రాండ్‌కు అవార్డు రావడం విశేషం. ప్రపంచప్రఖ్యాతి చెందిన విస్కీ టేస్టర్లు ప్యానెల్లో ఉండి అన్ని విస్కీలను రుచి చూస్తారు. వివిధ వడపోతల అనంతరం గెలిచిన వారిని ప్రకటిస్తారు.
ఇంద్రీ విస్కీని భారత్‌లోని హర్యానాలో తయారుచేస్తారు. పికాడిల్లీ డిస్టిలిరీస్ అనే సంస్థ ఈ తయారీని పర్యవేక్షిస్తుంది. 2021లో ప్రారంభమైన ఈ బ్రాండ్ దేశ తొలి ట్రిపుల్ బారెల్ సింగిల్ మాల్ట్ అని పికాడిల్లీ డిస్టిలరీస్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ శర్మ వెల్లడించారు.
‘ఇది చాలా ఆనందకర సమయం. విస్కీ తయారీ, మార్కెటింగ్‌లో మనం అంతర్జాతీయంగా ఎదగడానికి ఈ అంతర్జాతీయ అవార్డు చాలా సాయపడుతుంది. ఇంద్రీ బ్రాండ్‌కే కాడు అన్ని దేశీయ వ్యాపారసంస్థలకు ఇది ఉపయోగపడేదే’ అని ఆయన పేర్కొన్నారు. గత రెండేళ్లలో ఇంద్రీ బ్రాండ్ కనీసం 14 అంతర్జాతీయ అవార్డులను అందుకుందని తెలిపారు.
ఉత్తర భారతదేశ వాతావరణమూ ఈ విస్కీ రుచికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇక్కడి ఉష్ణమండల వాతావరణంలో పక్వానికి తెచ్చిన డ్రై ఫ్రూట్స్, నట్స్, మసాలా దినుసులు, చాక్లెట్ క్రీం తదితరాలను ఉపయోగించి ఇంద్రీ విస్కీని తయారు చేస్తున్నారు. దీని ధర ఇండియాలో యావరేజ్‌గా