Site icon vidhaatha

IRCTC | ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ డౌన్‌.. నిలిచిన టికెట్‌ బుకింగ్స్‌..!

IRCTC | ఐఆర్‌సీటీసీలో టికెట్ల బుకింగ్‌ నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతో టికెట్‌ బుకింగ్స్‌కు అంతరాయం కలుగుతున్నది. ఈ విషయాన్ని ఐఆర్‌సీటీసీ ట్విటర్‌ ద్వారా పేర్కొంది. ప్రస్తుతానికి వెబ్‌సైట్‌, యాప్‌లో టికెట్‌ బుకింగ్‌ సేవలు అందుబాటులో లేవని తెలిపింది. సమస్యను పరిష్కరించేందుకు సాంకేతిక బృందం ప్రయత్నిస్తుందని, సమస్య పరిష్కారమై సేవలు అందుబాటులోకి వచ్చాక సమాచారాన్ని ప్రకటిస్తామని ట్విట్టర్‌లో తెలిపింది. అప్పటి వరకు అమేజాన్‌తో పాటు, మేక్‌మై ట్రిప్‌, బీ2సీ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ప్రయాణికులు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి సాధారణ టికెట్లతో పాటు తత్కాల్‌ టికెట్ల సైతం బుకింగ్‌ కాకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సేవలను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.

Exit mobile version