Site icon vidhaatha

Dulquer Salmaan | ‘కల్కి’లో.. దుల్కర్ సల్మాన్ ఉన్నారా? ఫ్యాన్స్ ఖుష్

Dulquer Salmaan |

ప్రభాస్ నటిస్తున్న నాగ్ అశ్విన్ మూవీ ‘కల్కి 2898AD’ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. కమల్ హాసన్, అమితాబ్ వంటి అగ్ర హీరోలతో పాటు, దీపిక పదుకొణె, దిశా పటానీ, పశుపతి వంటి అగ్ర నటీనటులు ఈ మూవీలో నటిస్తున్నారు. ఇంత గొప్ప ప్రాజెక్ట్ ఎప్పుడు తమ ముందుకు వస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

అయితే ఈమధ్య కల్కి మూవీలో మరో హీరో కూడా నటించబోతున్నాడని, ప్రభాస్‌కు అతడికి మధ్య మంచి సీన్స్ ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిలోని నిజా నిజాలను ఇంకా చిత్ర బృందం ప్రకటించక పోయినా.. ఆ సదరు హీరోని అడిగితే అతడు కూడా మూవీ మేకర్స్ మాత్రమే దీని గురించి మాట్లాడాలని మరింత సస్పెన్స్‌లో పెట్టేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో త్వరలో రాబోతున్న భారీ మూవీ ‘కల్కి 2898AD’ గురించి ఎటువంటి సమాచారం తెలిసినా అది వైరల్ అవుతూనే ఉంది. ఇక తాజాగా ఈ మూవీలో మరో టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా నటించబోతున్నాడని.. ప్రభాస్, దుల్కర్ మధ్య మంచి సీన్స్ ఉన్నాయనే విషయం వైరల్‌గా మారింది.

ఇదే విషయాన్ని ఆయన కొత్త సినిమా ‘కింగ్ ఆఫ్ కొత్త’ ప్రమోషన్స్‌‌కి హాజరైన దుల్కర్‌ని అడగ్గా.. అతడు మరింత ఆసక్తిని రేపుతూ సమాధానం ఇచ్చాడు. అతను నేను చేస్తున్నానని చెప్పకపోయినా.. చేస్తున్నట్లుగానే ఆయనిచ్చిన సమాధానం ఉండటం విశేషం. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘కల్కి’ సెట్‌కి వెళ్ళినప్పుడు నాకు భలే ఆశ్చర్యం కలిగింది.

దర్శకుడు నాగీ ఆలోచనలు సినిమా సినిమాకూ మారుతూ వస్తున్నాయి. ‘ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి’.. ఇప్పుడు ‘కల్కి’.. అసలు సినిమా సినిమాకూ అశ్విన్ లెవెల్ మారుతూ వస్తుంది. అతను మాత్రమే ఇలాంటి గొప్ప ఆలోచనలు చేయగలడు. ఇక సినిమా భవిష్యత్తుకు సంబంధించినది కావడం కూడా బాగా ఆకట్టుకుంటుంది అని చెప్పాడు.

Exit mobile version