Jagan | ఢిల్లీకి జగన్.. ఏం జరుగుతోంది…

Jagan విధాత‌: ఆంధ్రా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఇక్కడ పొలిటికల్ సర్కిళ్లలో కాకరేపుతోంది . చాన్నాళ్ల తరువాత కీలక అంశాలు చర్చించే లక్ష్యంతో జగన్ ఢిల్లీ వెళ్లారు. ఈరోజే ఆయన ప్రధాని నరేంద్రమోడీ, హోమ్ మంత్రి అమిత్ షా .. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం తదితరులను కలిసి వస్తారు అన్నది అందులోని సారాంశం. అయితే అయన ఉద్దేశ్యం ఏమిటి.. ప్రధాన ఎజెండా అంశాలు ఏమిటన్నది తెలియడం లేదు. నిధుల కోసం.. […]

  • Publish Date - July 5, 2023 / 11:20 AM IST

Jagan

విధాత‌: ఆంధ్రా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఇక్కడ పొలిటికల్ సర్కిళ్లలో కాకరేపుతోంది . చాన్నాళ్ల తరువాత కీలక అంశాలు చర్చించే లక్ష్యంతో జగన్ ఢిల్లీ వెళ్లారు. ఈరోజే ఆయన ప్రధాని నరేంద్రమోడీ, హోమ్ మంత్రి అమిత్ షా .. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం తదితరులను కలిసి వస్తారు అన్నది అందులోని సారాంశం. అయితే అయన ఉద్దేశ్యం ఏమిటి.. ప్రధాన ఎజెండా అంశాలు ఏమిటన్నది తెలియడం లేదు.

నిధుల కోసం.. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు, ప్రాజెక్టుల కోసం వెళుతున్నట్లు చెబుతున్న అందులో కొంత వాస్తవం, ఇంకొంత బయటకు చెప్పని అంశాలు ఉన్నాయని అంటున్నారు. రెవెన్యూ లోటు కింద రూ. 10 వేలకు పైగా నిధులు మొన్ననే అందజేసిన కేంద్రం ఇప్పుడు పోలవరానికి ఇదివరకే కేంద్రం ఇస్తామన్న నిధులుం రూ. 12,000 కోట్లు త్వరలో రానున్నాయి.

ఇంకా కేంద్రం నుంచి మధ్యంతర సాయం కింద ఇంకో రూ. 22,000 కోట్లు ఇవ్వడానికి కేంద్రం రెడీగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇవన్నీ ఒకెత్తు కాగా ఇది కాకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎలాగూ ఇవ్వలేని పరిస్థితుల నేపథ్యంలో వేరే మార్గంలో ఇంకొన్ని నిధులు తెచ్చే విషయమై కేంద్రంతో ఆల్రెడీ చర్చించారని, అవి ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో బాటు రాష్ట్ర రాజధాని విశాఖ విషయమై ఇంకా వ్యాజ్యాలు కోర్టులో ఉన్నాయి. అవి ఇప్పుడిప్పుడే తేలేలా లేవు.

దీంతో కోర్టులతో సంబంధం లేకుండా నేరుగా విశాఖ వెళ్లేలా శాసన సభలో బిల్లు పెట్టి ఆమోదించి దాన్ని కేంద్రానికి పంపి, అక్కడ ఆమోదింపజేసేలా కేంద్రం అనుమతి తీసుకుంటారని అంటున్నారు. అలా ఐతే అప్పుడు విశాఖ రాజధాని కావడాన్ని ఇక కోర్టులు, టిడిపి ఆపలేవు. వీటితోబాటు రాష్ట్రంలో రాజకీయాలు, రానున్న ఎన్నికల విషయం మీద కూడా చర్చలు జరుగుతాయని అంటున్నారు.

ప్రస్తుతం జగన్ కు పరిస్థితి బాగున్నట్లు సర్వ్ రిపోర్ట్స్ వస్తున్న నేపథ్యంలో ఓ ఆర్నెల్లు ముందుగా ఎన్నికలు జరిపితే తమకు మరింత జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై కేంద్రం సపోర్ట్ తీసుకుని ఈ డిసెంబర్ లో ఎన్నికలకు వెళ్తే బావుంటుందని జగన్ అనుకుంటున్నారట ఆ విషయం సైతం ఢిల్లీలో చర్చిస్తారని అంటున్నారు.

ఏదైనా గానీ జగన్ పలు కీలక ఫైళ్లు క్లియర్ చేసే లక్ష్యంతో ఢిల్లీ వెళ్లారని సమాచారం. ఒకవేళ అది వాస్తవ రూపం దాలిస్తే ఇది ఇటు టిడిపి, జనసేన పార్టీలకు శరాఘాతం అవుతుంది..

Latest News