Site icon vidhaatha

అమిత్‌షా మార్ఫింగ్ వీడియో కేసులో విచారణపై హైకోర్టు స్టే

విచారణ నాలుగు వారాలకు వాయిదా

విధాత : రిజర్వేషన్ల రద్దు అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో తదుపరి విచారణ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసులో బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి చెందిన ఐదుగురు పెండ్యాల వంశీకృష్ణ ,మన్నే సతీష్ ,పీఠం నవీన్, అస్మాత్ అస్లీమ్, కోయా గీతలను అరెస్ట్ చేశారు. అమిత్ షా వీడియోను ఉద్దేశపూర్వకంగానే పోస్టింగ్ చేసినట్లు, వాట్సాప్ లో వచ్చిన మార్ఫింగ్ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసినట్లుగా గుర్తించారు. అటు ఈ కేసులో ఢిల్లీ పోలీసు సీఎం రేవంత్ రెడ్డితో సహా ఏడుగురికి నోటీసులు జారీ చేశారు.

వారిని విచారించేందుకు ఢిల్లీ పోలీసులు రెండు రోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్నారు. శుక్రవారం సైతం ఓ ఐపీఎస్ అధికారి హైదరాబాద్‌కు రావడంతో ఈ కేసులో అరెస్టుకుల అవకాశముందని భావించారు. ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు స్పిరిట్ అఫ్ కాంగ్రెస్ అకౌంట్ నడిపిస్తున్నకాంగ్రెస్ జాతీయ సోషల్ మీడియా కన్వినర్ అరుణ్ రెడ్డిని ఢిల్లీలో అరెస్ట్ చేశారు. దీంతో రాష్ట్రానికి సంబంధించి ఈ కేసులో ప్రమేమయన్న పీసీసీ సోషల్ మీడియా ప్రతినిధులను అరెస్టు చేయవచ్చన్న ప్రచారం వినిపించింది. ఇంతలోగా హైకోర్టు ఈ కేసులో విచారణపై స్టే విధించడంతో ఇప్పుడు ఢిల్లీ పోలీసులు ఏం చేయబోతారన్నది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version