Site icon vidhaatha

Jagtial | JPSల సమ్మెలో ఆసక్తికర దృశ్యం! ఆలింగనం చేసుకున్న MP అరవింద్, MLC జీవన్ రెడ్డి

Jagtial |

విధాత బ్యూరో, కరీంనగర్: వారిద్దరూ రెండు జాతీయ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు. ఆ పార్టీల మధ్య జరిగేది నిత్య సంగ్రామమే.. జగిత్యాల జిల్లా కేంద్రంలో అందుకు విరుద్ధంగా ఇరు పార్టీల నేతలు ఆకస్మికంగా తటస్థ పడ్డారు. బేషజాలను పక్కనపెట్టి కరచాలనం చేసుకున్నారు. వీరిలో ఒకరు బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కాగా, మరొకరు కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి.

పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు సంఘీభావం ప్రకటించడానికి వచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న క్రమంలో కార్యదర్శులకు మద్దతు ప్రకటించేందుకు నిజామాబాద్ ఎంపీ అరవింద్ అక్కడికి చేరుకున్నారు.

దీంతో ఇరువురు నేతలు పరస్పరం ఉభయకుశలోపరి పలకరించుకుని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. పరస్పర విరుద్ధ జాతీయ పార్టీల నేతల ఆత్మీయ కలయిక అక్కడి వారిని ఆశ్చర్యానికి
గురిచేసింది.

Exit mobile version