Site icon vidhaatha

D. Srinivas | మాజీ పీసీసీ చీఫ్ డీ.శ్రీనివాస్‌కు తీవ్ర ఆస్వస్తత.. ఆసుపత్రిలో చేరిక

D. Srinivas |

తీవ్ర అస్వస్థతకు గురైనట్లు అరవింద్ ట్వీట్‌

విధాత, నిజామాబాద్‌ ప్రతినిధి: మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన చిన్న కుమారుడు, బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ట్వీట్‌ ద్వారా తెలిపారు.

డి. శ్రీనివాస్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. కొంతకాలం నుంచి డీఎస్ వయసు రీత్యా పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. గత ఫిబ్రవరిలోనూ శ్రీనివాస్‌ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. మరోసారి కూడా ఆయన తీవ్ర అస్వస్థతకు లోనవ్వగా పరిస్థితి కొంత విషమంగా ఉందని, వైద్యులు అత్యవసర చికిత్సలు అందిస్తున్నట్లుగా తెలుస్తుంది.

Exit mobile version