మహిళా కలెక్టెర్‌తో ఓ మంత్రికి ఉన్న సంబంధం ఏంటని మీడియాలో వచ్చిన వార్తలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కలెక్టర్ల బదిలీలు మంత్రులు చూసుకోరని అన్నారు. ఐఏఎస్ అధికారుల బదిలీల అంశం ముఖ్యమంత్రి చేతుల్లో ఉంటుందని పేర్కొన్నారు. కలెక్టర్ ఉద్యోగం రావడం అంటే ఆషామాషి విషయం కాదని, అలాంటి ఉద్యోగులపై అబండాలు వేయడం సరైన పద్దతి కాదని మండిపడ్డారు.
అన్ని మీడియా యాజమాన్యాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పుడు వార్తలు ప్రాచారం చేయడం సరైంది కాదు, మహిళ అధికారులను మానసికంగా ఇబ్బంది పెట్టడం ఏమాత్రం మంచిది కాదని అన్నారు. ముఖ్యమంత్రి మీద కూడా ఇలాంటి వార్తనే వేశారు. సీఎంఓలో ఒక మహిళ అని ప్రసారం చేశారు, ఇంచార్జీ మంత్రి మీద కూడా వార్తలు వేస్తున్నారని, ఇప్పుడు నల్లగొండ మంత్రి అని తప్పుడు కథనాలు వేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవి ని వదులుకున్నాను, నా కుమారున్ని పోగొట్టుకున్నాను. నా కుమారుడు ప్రతీక్ పేరుతో ప్రజలకు సేవ చేస్తున్నానని, పేద ప్రజలకు సేవ చేస్తున్న నాపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యే గా, ఒకసారి ఎంపీగా గెలిచాను. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా రికార్డు స్థాయిలో ఎంపీ గా గెలిచానని, నన్ను మానసికంగా ఇబ్బంది కి గురి చెయ్యడం సబబు కాదని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. తప్పుడు వార్తలు వేసి ఎం సాధిస్తారు, నాకు దైవ భక్తి ఎక్కువ, నేను దేవుణ్ణి నమ్ముతా.. అంత దేవుడు చూసుకుంటాడని మంత్రి అన్నారు.
డీజీపీతో ఇలాంటి అంశాలపై చర్చించాము, సమగ్రంగా దర్యాప్తు జరిపించాలని డీజీపీ ని కోరామన్నారు. డిజిపీ,ఇంటిలిజెన్స్ అధికారులకు తప్పుడు వార్తలపై నివేదిక ఇవ్వాలని కోరామన్నారు. దీనిపై రీపోర్ట్ వచ్చిన తర్వాత లీగల్ యాక్షన్ తీసుకుంటామన్నారు. వాస్తవాలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నానన్నారు. ఇప్పటి తో ఇలాంటి వార్తల ను ప్రచారం చెయ్యడం మానెయ్యాలని వెల్లడించారు.
