విధాత, ప్రత్యేక ప్రతినిధి: చిన్నపిల్లల కిడ్నాప్ పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కాజిపేట్, టాస్క్ ఫోర్స్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి నిందితులు కొడుపాక నరేష్ , గ్రామం ఘవాపూర్ గ్రామం, పెద్దపల్లి జిల్లా మరియు 2)వెల్పుల యాదగిరి, నివాసం శాంతినగర్, పెద్దపల్లి టౌన్, పెద్దపల్లి జిల్లా కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మీడియా సమావేశం వివరాలు వెల్లడించారు.
డిసెంబర్ నెల 28వ తేదీన తెల్లవారుజామున కాజీపేట రైల్వే స్టేషన్ బయట ఫుట్ పాత్ పైన నిద్రిస్తున్న కన్నా నాయక్ కుమారుడైన 5 నెలల వయసున్న మల్లన్న అనే బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన సంఘటనలో బాలుడి తండ్రి కన్నా నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాజీపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇట్టి కేసు దర్యాప్తులో భాగంగా కాజిపేట్ మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు బృందం ఈ రోజు ఉదయం ఇద్దరు నిందితులను పట్టుకొని విచారించారు. నలుగురు చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టుగా ఒప్పుకున్నారు. పిల్లలను వీళ్ళు పిల్లలులేని దంపతులకు అనాధాశ్రమాల నుంచి తీసుకొచ్చి ఇస్తున్నట్టుగా నమ్మబలికి డబ్బులకు అమ్ముకున్నారు.
28 డిసెంబర్, 2025న కిడ్నాప్ చేసిన ఐదు నెలల బాబుని జన్నారం మండలం లింగయ్యపల్లీ గ్రామంలో విక్రయించారు. గతంలో కిడ్నాప్ చేసిన నలుగురు పిల్లల్లో 2025 ఆగస్టు లో వరంగల్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫాం పైన తల్లిదండ్రులతో నిద్రిస్తున్న 10 నెలల పాపను మంచిర్యాల జిల్లా నస్పూర్ లో, 2023 అక్టోబర్ లో కాజీపేట రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నందు తల్లిదండ్రులతో నిద్రిస్తున్న మూడు సంవత్సరాల బాబును జన్నారం మండలంలో, 2025 అక్టోబర్ లో మంచిర్యాల రైల్వే స్టేషన్ ముందు తల్లిదండ్రులతో నిద్రిస్తున్నటువంటి 5 నెలల పాపను మంచిర్యాలలో, 2025 జూన్ లో రామగుండం రైల్వే స్టేషన్ ముందు తల్లిదండ్రులతో నిద్రిస్తున్న 10 నెలల పాపను జగిత్యాల జిల్లాలో అమ్మినారు. అపహరణకు గురైన ఐదు నెలల బాబు మల్లన్నతో పాటు మిగతా నలుగురు పిల్లలను రెస్క్యూ చేశారు. ఎలాంటి చట్టబద్ధ ఆధారాలు లేకుండా కొనుగోలు చేసిన దంపతులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ మీడియా సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, టాస్క్ ఫోర్స్, కాజీపేట ఏసీపీ లు మధుసూదన్, ప్రశాంత్ రెడ్డి, కాజీపేట ఇన్స్ స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ అధికారులు సిబ్బంది తో పాటు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
Minister Komatireddy|| నాపై ఇలాంటి అబండాలు వేయడం కరెక్ట్ కాదు: మంత్రి కోమటిరెడ్డి
Beggar | యాచకుడి ప్రజాసేవ.. భిక్షం ఎత్తుకోగా వచ్చిన డబ్బుతో నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ
