విధాత, వరంగల్ ప్రతినిధి: వరంగల్ పరిధిలోని వరద ముంపు ప్రాంతాలలో క్షేత్ర స్థాయి లో రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ…వరంగల్ ఎం పి డాక్టర్ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ డా.సత్య శారద అదనపు కలెక్టర్ సంధ్యారాణి పర్యటించారు.ఈ సందర్భంగా బాధితులను పరామర్శించి, సహాయక చర్యలు పరిశీలించి, అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
హనుమకొండలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ స్నేహ శబరీష్, కమీషనర్ చాహత్ బాజ్ పాయ్ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.
ఇదిలా ఉండగా వరంగల్ హనుమకొండ కాజీపేట ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో గురువారం కూడా వర్షం నీరు నిలిచి ఉంది. కొన్ని చోట్ల నీరు సాఫీగా వెళ్ళేందుకు నగరపాలక సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బాధితుల కోసం పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ శిబిరాలను మేయర్ గుండు సుధారాణి, అధికారులను సందర్శించి వారి అవసరాలను, ఏర్పాట్లను తెలుసుకున్నారు.
గురువారం వరంగల్ నగరంలోని వరద ప్రాంతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేస్తారని భావించినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో శుక్రవారం ఏరియల్ సర్వే చేపట్టేందుకు నిర్ణయించారు.
