శాస్త్రీయ విద్యా సాధనకు ఉద్యమం..హనుమకొండలో పీడీఎస్ యూ విద్యార్థుల భారీ ప్రదర్శన

శాస్త్రీయ విద్యా సాధన కోసం ప్రగతిశీల ఉద్యమాలు నిర్వహించాలని పీడీఎస్ యూ నాయకులు పిలుపునిచ్చారు. పీడీఎస్ యూ) తెలంగాణ రాష్ట్ర 23వ రాష్ట్ర మహాసభల సందర్భంగా సోమవారం హనుమకొండ ఏకశిలా పార్క్ నుండీ కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్, సైన్స్ కాలేజ్ గ్రౌండ్ వరకు విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు

విధాత, వరంగల్ ప్రతినిధి: శాస్త్రీయ విద్యా సాధన కోసం ప్రగతిశీల ఉద్యమాలు నిర్వహించాలని పీడీఎస్ యూ నాయకులు పిలుపునిచ్చారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్ యూ) తెలంగాణ రాష్ట్ర 23వ రాష్ట్ర మహాసభల సందర్భంగా సోమవారం హనుమకొండ ఏకశిలా పార్క్ నుండీ కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్, సైన్స్ కాలేజ్ గ్రౌండ్ వరకు విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పి.డి.ఎస్.యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వి.శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభకు ముఖ్య వక్తలుగా పి.డి.ఎస్.యూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు పి.ప్రసాద్,సాధినేని వెంకటేశ్వరరావు, ప్రగతిశీల మహిళ సంఘం జాతీయ నాయకులు వి.సంధ్య హాజరై మాట్లాడుతూ పీ.డీ.ఎస్.యూ అర్థం శతాబ్దం పై గా తెలుగు రాష్ట్రాలల్లో విద్యార్థుల గొంతుగా సమరశీల పోరాటాలను నిర్వస్తూ విద్యార్థుల హక్కుల కోసం పనిచేస్తున్నదని అన్నారు. జార్జిరెడ్డి ప్రేరణతో ఆవిర్భవించిన పీ.డీ.ఎస్.యు ఐదు దశాబ్దాల కాలంగా దేశంలో శాస్త్రీయ, సమాన విద్యా విధానం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ మహోజ్వలమైన చరిత్రను నిర్మించిందన్నారు. నేడు దేశంలో ప్రజాస్వామ్యం తీవ్రమైన సంక్షోభ దశలో ఉన్నదనీ, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం రోజురోజుకు తీవ్రమైపోతున్నదని, అదే విధంగా దేశ పౌరుల భవిష్యత్తు కూడా చాలా ఆందోళనకరంగా మారిపోతుందనీ అన్నారు. మానవ సంబంధాలన్నీ కూలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజ్యాంగానికి విఘాతం కలిగించే విధానాలకు పాలక ప్రభుత్వాలు పాల్పడుతున్నాయని అన్నారు. సమానమైన,నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని ఆరోపించారు. నిత్యం స్వదేశీ జపం చేసే భాజపా విద్యను వ్యాపార సరుకుగా మారుస్తూ విదేశీ, ప్రైవేటు యూనివర్సిటీలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తున్నారని దుయ్యబట్టారు. విద్యార్థులందరికీ సమానమైన,నాణ్యమైన విద్య అందించడం ద్వారానే సమాజం పురోగతి చెందుతుందని అందుకు అనుగుణంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లలో విద్యకు అధిక నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యా పరిరక్షణ కోసం పీ.డీ.ఎస్.యు సంస్థ మరింత తీవ్రమైన విద్యార్థి ఉద్యమాలు నిర్మించవలసిన ప్రాసంగీకత ఉన్నదని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు నిర్వహించాలని అన్నారు. ఈ సభలో  పి.డి.ఎస్.యు పూర్వ రాష్ట్ర అధ్యక్షులు ఎం.శ్రీనివాస్, పి.డి.ఎస్.యూ జె.ఎన్.యు నాయకులు సౌరవ్, పంజాబ్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ధీరద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కే.భాస్కర్,ఎం.వినోద్, ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు భువనగిరి మధు,జన్నారపు రాజేశ్వర్,డి.శ్రీకాంత్,మంద నవీన్, సంతోష్.రాష్ట్ర సహాయ కార్యదర్శిలు ఆర్.గౌతమ్ కుమార్,జి.మస్తాన్, జగజెంపుల తిరుపతి,డి.ప్రణయ్ కుమార్, కే.శ్రీనివాస్, మామిడాల ప్రవీణ్, కోశాధికారి కె. రానా ప్రతాప్, ఉమ్మడి వరంగల్ జిల్లా పూర్వ అధ్యక్షులు రాచర్ల బాలరాజు, అధ్యక్ష కార్యదర్శులు గుర్రం అజయ్,మర్రి మహేష్, రాష్ట్ర నాయకులు మాదారపు నాగరాజు, తీగల శ్యామ్, ఎస్.కె.ఆసిఫ్, కే.ఝాన్సీ, దీపాలక్ష్మి, గడ్డం గౌతం, రెడ్డి చరణ్,గణేష్, శ్రీనివాస్, పుల్లూరి సింహాద్రి, పోలే పవన్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

Pandugappa Fish : గోదావరిలో చిక్కిన పండుగప్ప చేప..భారీ ధరకు విక్రయం
Gold And Silver Price Today : మళ్లీ పైకి లేచిన బంగారం, వెండి ధరలు

Jolin Tsai Performance On Anaconda : అద్బుతం..అనకొండ పాముపై యువతి స్వారీ వైరల్

Latest News