విధాత : భారీ అనకొండ పాము తలపై నిలుచుని ఓ యువతి స్వారీ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ అద్బుత సాహస ప్రదర్శనకు తైపీ దేశం వేదికగా నిలిచంది. జోలిన్ సాయ్ అనే యువతి 30మీటర్ల భారీ అనకొండ పాముపై స్వారీ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.
వివరాల్లోకి వెళితే తైపీ అరీనాలో జరిగిన ప్లెజర్ వరల్డ్ టూర్ ఓపెనర్‌లో 30 మీటర్ల మెకానికల్ వండర్ అనకొండ పాముపై నిలబడి జోలిన్ సాయ్ సాహసోపేతమైన ప్రదర్శన, డ్యాన్స్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది.
చూడటానికి అత్యంత భయంకరంగా, అనకొండ సినిమాలోని ఆమెజాన్ అడవుల్లోని భారీ అనకొండ పామును తలపించేలా రూపొందించిన కృత్రిమ అనకొండ వేదికపైకి దూసుకురాగా..దాని తలపై నిలబడి జోలిన్ సాయ్ చేసిన ప్రదర్శన అందరిని విస్మయపరిచింది. భారీ అనకొండ ప్రేక్షకులకు అతి సమీపంగా సాగిపోతూ భయాంకరంగా నోరు తెరుస్తూ సరసరా పాకుతుండగా..తలపై యువతి జోలిన్ సాయ్ నిలుచుని డాన్స్ తో ఆకట్టుకుంది. ఇంజనీరింగ్ అద్బుతానికి..మానవ ప్రదర్శన జోడించడంతో ఈ ప్రదర్శన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో దూసుకపోతుంది.
Jolin Tsai gains attention after riding a huge snake during her stage.pic.twitter.com/phzjvKeOHF
— About Music (@AboutMusicYT) January 4, 2026
ఇవి కూడా చదవండి :
Kavitha new party| తెలంగాణ కొత్త రాజకీయ శక్తిగా ప్రజల్లోకి : కవిత ప్రకటన
