Poha | పోహా తింటున్నారా..? అయితే ఈ వీడియో చూడండి.. ఇక జీవితంలో దాని జోలికి పోరు

అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే పోహా (Poha)ను కొంద‌రు అప‌రిశుభ్ర‌త వాతావ‌ర‌ణంలో ప్యాక్ చేస్తున్నారు (Poha allegedly being packed on dirty floors). ఇందుకు సంబంధించిన వీడియో ఒక‌టి వైర‌ల్ (Viral Video)గా మారింది.

Poha allegedly being packed on dirty floors

Poha | సాధార‌ణంగా చాలామంది లూజ్ కంటే ప్యాక్ చేసిన ఆహార ప‌దార్థాల‌నే (సేమ్యా, పోహా, బొరుగులు) ఎక్కువ‌గా కొంటుంటారు.. ఎందుకంటే అవి సుర‌క్షిత‌మ‌ని, ప‌రిశుభ్ర‌మ‌ని అనుకుంటారు. అలా అనుకునే వారికోస‌మే ఈ క‌థ‌నం. మ‌నం రోజు ఉద‌యం అల్ప‌హారం కింద ఎంతో ఇష్టంగా తినే పోహా (Poha) (అటుకులు)ను కొంద‌రు అప‌రిశుభ్ర‌త వాతావ‌ర‌ణంలో ప్యాక్ చేస్తున్నారు (Poha allegedly being packed on dirty floors).

అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే పోహాను నేలపై కుప్పగా వేసి.. దానిపై కార్మికులు కూర్చుని మ‌రీ ప్యాకింగ్ చేస్తున్నారు. పోహా మొత్తం నేల‌పై ప‌డి ఉంది. కార్మికుల దుస్తులు కూడా శుభ్రంగా లేవు. చేతుల‌కు కూడా ఎలాంటి క‌వ‌ర్లూ వేసుకోలేదు. పైగా కొంద‌రు కార్మికులు అదే పోహాను నోట్లో వేసుకుంటున్నారు. నోట్లో వేసుకునే క్ర‌మంలో అది మ‌ళ్లీ కింద ఉన్న పోహాలో క‌లిసిపోతోంది. దాన్నేక‌వ‌ర్లోకి నింపి ప్యాక్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒక‌టి వైర‌ల్‌గా మారింది. అప‌రిశుభ్రత‌ వాతావ‌ర‌ణంలో ప్యాకింగ్ చేస్తున్న‌ తీరు అంద‌రినీ షాక్‌కు గురి చేస్తోంది. ఈ వీడియోపై నెటిజ‌న్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వీడియో ఆహార భద్రతపై ప్రశ్నలు తలెత్తుతోంది. ప‌లువురు నెటిజ‌న్లు ఇలాంటి వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. తినే వ‌స్తువుల‌ను ప్యాక్ చేసేట‌ప్పుడు, చేతులు, త‌ల క‌వ‌ర్ అయ్యేలా గ్లైజెస్ లేదా క‌వ‌ర్లు వేసుకోవాల‌ని సూచిస్తున్నారు. ప‌ది మంది తినే ఆహారాన్ని ఇలా అప‌రిశుభ్రంగా ప్యాక్ చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు..? ప్యాక్ చేసిన ఆహార వ‌స్తువుల‌ కొనుగోలు చేసేటప్పుడు బ్రాండ్, నాణ్యతపై శ్ర‌ద్ధ వ‌హించాల‌ని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Leopard Attack | షాకింగ్‌.. బైక‌ర్‌పైకి దూకిన చిరుత‌.. అత‌డు ఏం చేశాడో చూడండి..?
iPhone 17 Pro Max | ఫోన్ క‌వ‌ర్ కొంటే ఐఫోన్ ప్రో మ్యాక్స్ ఉచితం.. అక్క‌డే ఉంది అస‌లు ట్విస్ట్‌..

Latest News