Site icon vidhaatha

Janasena | బలిజలే టార్గెట్.. సీమలో త్వరలో వారాహి యాత్ర

Janasena |

విధాత: ఇప్పటికే ఈస్ట్ గోదావరి, విశాఖ జిల్లాల్లో వారాహి యాత్రలు చేసిన పవన్ కళ్యాణ్ ఇకముందు తన వాహనాన్ని రాయలసీమ వైపు నడిపించబోతున్నారు. అక్కడ కాపుల మద్దతుకోసం గట్టిగా ప్రయత్నించి జగన్, వలంటీర్ వ్యవస్థ మీద దూకుడుగా కామెంట్లు చేసిన పవన్.. ఇప్పుడు రాయలసీమ బాట పట్టనున్నారు. ఎక్కువగా ఉన్న బలిజ సామాజికవర్గాన్ని ఆకట్టుకునేందుకు యాత్ర మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

52 నియోజకవర్గాలున్న రాయలసీమ నాలుగు జిల్లాల్లోనూ పవన్ యాత్ర చేస్తారని అంటున్నారు. ఈజిల్లాల్లో తమ పార్టీ తరపున కనీసం 15 మందిని అయినా నిలబెట్టాలని అయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీమలో 15 సీట్లు ఇచ్చే ధైర్యం తెలుగుదేశం చేస్తుందా ? లేక పవన్ ఒంటరిగా లేదా బీజేపీతో వెళతారా అన్నది ఇంకా ఖరారు కాలేదు.

అయితే రాష్ట్రం నాలుగు చెరగులా తన ప్రాబల్యాన్ని, జనంలో ఇమేజిని పెంచుకుని, తరువాత టీడీపీతో సీట్లబేరం మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తనకు సీఎం పదవి కావాలని చెప్పిన పవన్, తమ కేడర్ లో ఉత్సాహాన్ని నింపారు. తద్వారా ఓటింగ్, జనంలో బలాన్ని చూపించి టీడీపీని మరికొన్ని ఎక్కువసీట్లు డిమాండ్ చేయాలన్నది పవన్ వ్యూహం అని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ కానీ విడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి జగన్ గెలుపు సులువవుతుంది. అందుకే వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెబుతూనే, తన పార్టీకి గౌరవప్రదమైన సీట్లు కావాలని పవన్ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు సీమలో సైతం యాత్రకు సిద్ధమవుతున్నారు.

Exit mobile version