Site icon vidhaatha

Devara Japan: అన్నా.. నేను తెలుగు నేర్చుకున్నా: Jr.Ntrతో జపాన్ యువతి భావోద్వేగం

Devara | Japan

విధాత : బాహుబలి.. ఆర్ఆర్ఆర్ .. పుష్ప వంటి సినిమాలతో తెలుగు హీరోల పట్ల అభిమానం ఖండాంతరాలు దాటిపోయింది. విదేశాల్లోనూ ప్రభాస్, ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్ వంటి వారికి భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇది ఆ దేశాల్లో వారి సినిమాలకు మంచి కలెక్షన్స్ సైతం రాబట్టేందుకు దోహదం చేస్తుంది. ఇదంతా ఒకవైపు అయితే..ఇంకోవైపు తమ అభిమాన తెలుగు హీరోల పట్ల అభిమానం కాస్తా వారి భాషను సైతం నేర్చుకునేందుకు విదేశీయులను పురిగొల్పుతుండటం అద్భుత పరిణామం. ఇందుకు జపాన్ దేశంలో జూనియర్ ఎన్టీఆర్ పర్యటనలో ఎదురైన సంఘటన వేదికైంది.

దేవర సినిమా ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ ను చూసేందుకు, కలిసేందుకు పెద్ధ ఎత్తున జపాన్ ప్రేక్షకులు తరలివచ్చారు. ఈ క్రమంలో ప్రమోషన్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఆటో గ్రాఫ్ కోసం ప్రేక్షకుల గుంపులో నుంచి వచ్చిన ఓ యువతి అన్నా..అన్నా..నేను తెలుగు నేర్చుకున్నానంటూ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

అన్నా..తాను ఆర్ఆర్ఆర్ మూవీ చూసిన తర్వాతా తెలుగు నేర్చుకున్నానంటూ ఆ జపాన్ యువతి తెలుగులో ముద్దుముద్దుగా భావోద్వేగంతో చెప్పుకొచ్చింది. నా పేరు మాటో మసాలాని.. నేను ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నానని.. రెండు సంవత్సరాల ముందు తెలుగులో పుస్తకం కూడా రాశానన్నారు. మీరు నాకు బిగ్ ఇన్ స్ప్రేషన్ అని చెప్పుకొచ్చింది.

అభిమాని చెప్పిన మాటలు విని.. రాసిన పుస్తకం చూసిన ఎన్టీఆర్ వావ్ అంటూ ఆమెతో కరచాలనం చేసి ఆటోగ్రాఫ్ ఇచ్చారు. మీరే నాకు ఇన్ స్ప్రేషన్ అని అభినందించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెలుగు సినిమాలు విదేశాల్లో తెలుగు ఇండస్ట్రీకి గుర్తింపు తీసుకరావడమే కాకుండా తెలుగు భాషకు కూడా మంచి గుర్తింపు తెస్తున్నాయంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాకు జపాన్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుండటం విశేషం.

Exit mobile version