Site icon vidhaatha

Saturn | శ‌ని ఆభ‌ర‌ణం వ‌య‌సు.. 40 కోట్ల సంవ‌త్స‌రాలే

Saturn |

అన్ని గ్ర‌హాల్లోనూ చూడ‌గానే గుర్తుప‌ట్టే గ్ర‌హం శ‌ని. దాని చుట్టూ ఉన్న వ‌ల‌యాలే దీనికి కార‌ణం. తాజాగా శాస్త్రవేత్త‌లు వాటి వ‌యసును 40 కోట్లుగా నిర్ధ‌రించారు. 450 కోట్ల సంవ‌త్స‌రాల వ‌య‌సున్న శ‌ని గ్ర‌హానికి దాని ఆభ‌ర‌ణం మాత్రం ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిందేన‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు.

శ‌ని చుట్టూ ఉన్న వ‌ల‌యాలు లెక్క‌లేన‌న్ని మంచు పార్టిక‌ల్స్‌తో త‌యార‌య్యాయి. వాటిని ఆస్ట‌రాయిడ్లు ఢీకొట్ట‌డంతో బుర‌ద‌తో నిండిపోయి న‌ల్ల‌టి ప‌దార్థాలుగా మారిపోయాయి. కాస్మిక్ స్టెయినింగ్ అనే ప‌ద్ధ‌తిలో 2004 నుంచి 2017 వ‌ర‌కు శ‌ని ద‌గ్గ‌ర ఉన్న కాసినీ స్పేస్‌క్రాఫ్ట్ 160 పార్టిక‌ల్స్‌ను సేక‌రించింది.

దాని చుట్టూ తిరిగే చిన్న చిన్న మైక్రో మెట‌రాయిడ్స్‌నూ ప‌రిశీలించింది. ఆ పార్టిక‌ల్స్ శ‌ని వ‌ల‌యాల్లోకి ఎంత వేగంతో వ‌స్తున్నాయి. వ‌చ్చి అక్క‌డి వాటితో ఎంత స‌మ‌యంలో క‌లిసిపోతున్నాయ‌ని ప‌రిశీలించారు. వాటి రంగు పూర్తి న‌లుపుగా మార‌డానికి ఎంత స‌మ‌యం ప‌డుతోందో క‌నుక్కొని పూర్తి వ‌ల‌యం ఏర్ప‌డిన స‌మ‌యాన్ని గ‌ణించారు.

అయితే ఇంకా గుర్తించ‌ని ఒక ప‌ద్ధ‌తిలో ఈ వ‌ల‌యాలు ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్ర‌ ప‌డుతున్నాయ‌ని, పాత పార్టిక‌ల్స్ తొల‌గిపోయి కొత్త‌వి వ‌స్తూ ఉండ‌టం వ‌ల్ల వాటి వ‌య‌సులో పెద్ద మార్పు క‌నిపించ‌డం లేద‌ని ప‌రిశోధ‌కులు పేర్కొన్నారు

Exit mobile version