Jr NTR: ‘పార్టీ లేదా పుష్పా?’ అంటూ.. బన్నీని టీజ్ చేసిన NTR

Jr NTR: ఒక వైపు మెగా, నందమూరి అభిమానులు మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప అని సోషల్ మీడియాకి ఎక్కి రచ్చ రచ్చ చేస్తుంటారు. ఒకరి అభిమాన హీరోపై మరొకరు బూతులు తిట్టుకుంటూ.. ఆ హీరోల పరువు తీస్తుంటారు. మరోవైపు మాత్రం ఆ హీరోలు మా మధ్య సినిమాల విషయంలో పోటీ ఉంటుంది కానీ.. మేమంతా ఒక్కటే.. అని చెప్పడమే కాకుండా సమయం వచ్చినప్పుడల్లా.. ఆ విషయం తెలియజేస్తున్నారు. రీసెంట్‌గా మెగా పవర్ స్టార్ […]

  • Publish Date - April 8, 2023 / 04:37 PM IST

Jr NTR:

ఒక వైపు మెగా, నందమూరి అభిమానులు మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప అని సోషల్ మీడియాకి ఎక్కి రచ్చ రచ్చ చేస్తుంటారు. ఒకరి అభిమాన హీరోపై మరొకరు బూతులు తిట్టుకుంటూ.. ఆ హీరోల పరువు తీస్తుంటారు. మరోవైపు మాత్రం ఆ హీరోలు మా మధ్య సినిమాల విషయంలో పోటీ ఉంటుంది కానీ.. మేమంతా ఒక్కటే.. అని చెప్పడమే కాకుండా సమయం వచ్చినప్పుడల్లా.. ఆ విషయం తెలియజేస్తున్నారు.

రీసెంట్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి ‘RRR’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్‌లో ఇద్దరి మధ్య సోదరబంధం ఉందని వారు వెల్లడించారు. అలాగే ఇద్దరిలో ఎవరి పుట్టినరోజు వచ్చినా.. ఇంట్లో చెప్పకుండా ఇద్దరం చెక్కేస్తామని కూడా సెలవిచ్చారు. అయితే ఫ్యాన్స్ మధ్య కోట్లాటలు మాత్రం తగ్గలేదు. తాజాగా మరోసారి యంగ్ టైగర్, మెగా హీరోతో ఉన్న బాండింగ్‌ని సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు.

ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. సెలబ్రిటీలెందరో బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఇన్‌స్టాగ్రమ్ వేదికగా అల్లు అర్జున్‌కు పుట్టినరోజు గ్రీటింగ్స్ తెలిపాడు. అయితే.. ఇవన్నీ ఒక ఎత్తయితే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన విష్ మరో ఎత్తు అని చెప్పుకోవాలి. ‘బావ.. అల్లు అర్జున్ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. నువ్వు గొప్పగా ఉండాలి’ అని ట్విట్టర్ వేదికగా తారక్ శుభాకాంక్షలు తెలిపాడు.

ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్‌కు బన్నీ రిప్లయ్‌లో.. ‘వార్మ్ హగ్స్.. నీ లవ్లీ విశెష్‌కు ధన్యవాదాలు బావ’ అని పేర్కొన్నాడు. దీనికి ఎన్టీఆర్ మళ్లీ స్పందిస్తూ.. ‘కేవలం హగ్స్ మాత్రమేనా? పార్టీ లేదా పుష్పా?’ అంటూ బన్నీని టీజ్ చేశాడు. దీనికి మళ్లీ బన్నీ.. ఇటీవల NTR30 సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ షూట్‌లో జాయిన్ అయినట్లుగా చూపిస్తూ వదిలిన వీడియోలో ఉన్న డైలాగ్.. ‘వస్తున్నా’ అంటూ సమాధానమిచ్చారు.

ఈ ఇద్దరి మధ్య ట్విట్టర్‌లో జరిగిన సంభాషణ.. ఇరు అభిమానులకు హుషారును, ఆనందాన్ని కలిగించింది. ఫ్యాన్స్ అందరూ ఈ సంభాషణ చూసి మురిసిపోతున్నారు. అయితే ఇదంతా ఒక్కరోజు మాత్రమే వారికి ఉంటుంది. మళ్లీ వాళ్లు మాములుగానే మారిపోయి.. గొప్పలకు దిగుతారు. అవన్నీ ఇప్పుడెందుకులే కానీ.. సరదాగా బన్నీ, ఎన్టీఆర్‌ల సంభాషణను చూసి హాయిగా ఆహ్లాదించండి.