Site icon vidhaatha

Kajal Aggarwal | సినిమాలకు గుడ్‌ బై చెప్పనున్న టాలీవుడ్‌ చందమామ కాజల్‌..!

Kajal Aggarwal | లక్ష్మీ కల్యాణం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కాజల్‌ అగర్వాల్‌. ఆ తర్వాత చందమామతో తెలుగు ప్రేక్షలకులను పలకరించింది. మగధీరతో టాలీవుడ్‌లో అగ్రహీరోయిన్‌గా ఎదిగింది. టాప్‌ హీరోలందరితో కలిసి నటించింది. దాదాపు 15 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా కొనసాగుతున్నది. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తుండగా.. ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

ఇందుకు బలమైన కారణాలు కూడా లేకపోలేదని పేర్కొంటున్నారు. 2020 వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లూను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి నీల్‌ అనే కొడుకు సైతం ఉన్నాడు. ఇటీవల నీల్‌ ఫస్ట్‌ బర్త్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించింది. అయితే, సినిమాల కారణంగా తన కొడుకుతో గడిపేందుకు సమయం దొరకడం లేదని కాజల్‌ భావిస్తోంది సమాచారం. ఈ నేపథ్యంలోనే కుటుంబంతో గడిపేందుకు వీడ్కోలు పలకాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది.

ఈ క్రమంలోనే కాజల్‌ చేసిన ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది. ‘అంగీకరించిన పనులన్నీ అయిపోయిన సమయంలో.. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు!’ అంటూ టాలీవుడ్‌ చందమామ ట్వీట్‌ చేసింది. దాంతో పాటు రిలాక్స్‌గా కూర్చొని ఉన్న ఓ ఫొటోను సైతం పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే కాజల్‌ సినిమాలకు గుడ్‌బై చెప్పనుందనే వార్తలను ట్వీట్‌తో కన్ఫమ్‌ చేసిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాజల్‌ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘భగవంత్‌ కేసరి’లో హీరోయిన్‌గా నటిస్తున్నది. అదే సమయంలోనూ ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న ‘భారతీయుడు-2 చిత్రంలోనూ కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నది.

ఈ రెండు చిత్రాల తర్వాత మరే చిత్రాలకు కాజల్‌ అంగీకరించలేదని సమాచారం. ఈ రెండు చిత్రాలు ముగిసిన తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పనుందని టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తుంది. అంతేకాకుండా రెండోసారి తల్లికాబోతుందని, అందుకే సినిమాలకు దూరం కానుందని ప్రచారం జరుగుతున్నది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.

Exit mobile version