Site icon vidhaatha

Kaloji Award 2023 | క‌వి జ‌య‌రాజ్‌కు కాళోజీ అవార్డు

Kaloji Award 2023

విధాత‌, హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్ర భాష దినోత్సవం సందర్భంగా కవి జయరాజ్‌కు ప్రభుత్వం కాళోజీ అవార్డు అందించింది. ప్రజా కవి కాళోజీ నారాయణరావు 109 వ జయంతి వేడుక‌ల సంద‌ర్భంగా హైద‌రాబాద్‌, ర‌వీంద్ర భార‌తీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్య‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. తెలంగాణ రాష్ట్ర భాష దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్ర‌తి ఏటా సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో కృషి చేసిన వారిని గుర్తిస్తూ కాళోజీ అవార్డును అందిస్తున్నది.

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ కలిసి జ‌య‌రాజ్‌కు అవార్డుతోపాటు 1 లక్ష 116 రూపాయల చెక్కును అందించి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవార్డుకు కవి జయరాజ్‌ను ఎంపిక చేయటం ఆనందంగా ఉందన్నారు. ఆయ‌న‌ సాహిత్య రంగానికి అందించిన సేవలను కొనియాడారు

Exit mobile version