Site icon vidhaatha

Chandramukhi 2 | ఈ సాంగ్‌తో.. కంగనాను ‘చంద్రముఖి’గా జడ్జ్ చే యొచ్చా..

Chandramukhi 2 | Kangana Ranaut |

చంద్రముఖి సినిమాకు సీక్వెల్ రాబోతుందని ఇప్పటికే చంద్రముఖి పాత్రను ఇష్టపడిన వారందరికీ తెలిసిన సంగతే. ఇందులో హిందీ నటి కంగనా రనౌత్ చంద్రముఖి పాత్రను చేస్తుంది. చంద్రముఖి మూవీకి సీక్వెల్ అనగానే ఫస్ట్ లుక్ గురించే అంతా ఎదురుచూశారు.

అసలు సినిమా ఏలా ఉండబోతుందనే ఆతృత అందరిలోనూ ఉంది. చంద్రముఖిగా కంగనా నప్పుతుందా? అనేదానికి సమాధానంగా ఫస్ట్ లుక్‌లో కంగనా నటన కనిపించకపోయినా ఆమె చంద్రముఖి పాత్రకు న్యాయం చేస్తుందనే నమ్మకాన్ని అయితే ఇచ్చింది. అయితే ‘చంద్రముఖి 2’కు సంబంధించి విడుదలైన ఓ సాంగ్‌తో కంగనాను చాలా మంది జడ్జ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ‘స్వాగతాంజలి’ పేరుతో ఓ లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో కంగనా రాజ నర్తకిగా నాట్యం చేస్తూ మెట్లు దిగుతూ రావడం కనిపిస్తుంది. చంద్రముఖిలోని ఇంతకు ముందు చూసిన వయ్యారం, గంభీర్యం కనిపించాయి. రాజనర్తకిగా సభలో నాట్యం చేస్తూ కనిపిస్తుంది. కంగనా హావభావాలు పాత్రకు సరిపోతాయా అనే అనుమానాన్ని తీసేసినట్టుగా ఉంది పాట. ఇక మొత్తం పాటను చూపించకపోయినా లిరిక్స్, భావం వినసొంపుగా అయితే ఉన్నాయి.

చంద్రముఖిగా కంగనా కూడా మెప్పిస్తుందనేలా.. ఈ పాటతో అయితే చాలా మంది ఆమెని జడ్జ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్‌తో పాటు విడుదలైన ట్రైలర్ కూడా.. దాదాపు పాత ‘చంద్రముఖి’ని కాస్త అటు ఇటు తిప్పి చూపించబోతున్నారనే ఫీల్‌ని ఇచ్చాయి. ఫైనల్‌గా సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అన్నట్లు.. ఈ సినిమా సెప్టెంబర్ 15 నుండి 28కి వాయిదా పడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

‘స్వాగతాంజలి’ పాట విషయానికి వస్తే.. చైతన్య ప్రసాద్ రాయగా, శ్రీనిధి తిరుమల పాడారు. ఆస్కార్ విజేత ఎమ్.ఎమ్. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చంద్రముఖి 2 మూవీలో వడివేలు, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, రాధికా శరత్ కుమార్, విఘ్నేష్, వై. జి. మహేంద్రన్, రావు రమేష్. సురేష్ మీనన్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు.

Exit mobile version