Karimnagar | మద్యం వ్యాపారంలోకి విద్యావేత్త! ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే టికెట్ ఆశించి.. మద్యం దుకాణంతో సరి

Karimnagar | మద్యం దుకాణంతో సరిపెట్టుకున్న ట్రస్మా నేత విధాత బ్యూరో, కరీంనగర్: మద్యం షాపుల కేటాయింపు కోసం సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన లక్కీ డ్రాలో అసాధారణ పరిణామం చోటుచేసుకుంది. జీవితకాలం విద్యా రంగంలో కొనసాగి, రెండు ప్రైవేటు పాఠశాలలు నిర్వహిస్తున్న ఓ విద్యావేత్త మద్యం వ్యాపారంలో ప్రవేశించి, మద్యం విక్రయించడానికి లైసెన్స్ పొందడం పలువురిని విస్మయానికి గురి చేసింది. తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యాదగిరి […]

  • Publish Date - August 21, 2023 / 05:40 PM IST

Karimnagar |

మద్యం దుకాణంతో సరిపెట్టుకున్న ట్రస్మా నేత

విధాత బ్యూరో, కరీంనగర్: మద్యం షాపుల కేటాయింపు కోసం సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన లక్కీ డ్రాలో అసాధారణ పరిణామం చోటుచేసుకుంది. జీవితకాలం విద్యా రంగంలో కొనసాగి, రెండు ప్రైవేటు పాఠశాలలు నిర్వహిస్తున్న ఓ విద్యావేత్త మద్యం వ్యాపారంలో ప్రవేశించి, మద్యం విక్రయించడానికి లైసెన్స్ పొందడం పలువురిని విస్మయానికి గురి చేసింది.

తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు లక్కీ డ్రాలో మద్యం దుకాణాన్ని చేజిక్కించుకున్నారు. రెండున్నర దశాబ్దాలుగా విద్యారంగంలో కీలక పాత్ర పోషించి, రాష్ట్ర సాధన ఉద్యమంలో ట్రస్మా ఆధ్వర్యంలో, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన ఆయన మద్యం దుకాణాల నిర్వహణకు ముందుకు రావడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.

సోమవారం నాటి లక్కీ డ్రాలో ఆయన పట్టణంలోని 13వ నెంబర్ షాపు దక్కించుకున్నారు. కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుండి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపి, నామినేషన్ దాఖలు చేసిన శేఖర్ రావు అధికార పార్టీ ఆదేశాలకు లోబడి తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు.

వచ్చే శాసనసభ ఎన్నికల్లో తన సొంత జిల్లా ఆదిలాబాద్ లోని ఏదేని శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని భావించి ఆ మేరకు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పదవుల మాట ఎలా ఉన్నా, చివరకు ఆయన మద్యం షాపును మాత్రం దక్కించుకోగలిగారు.

Latest News