LIC policy | ఐదేండ్లు ప్రీమియం కడితే.. లైఫ్‌ టైమ్‌ రిటర్న్స్‌ గ్యారంటీ.. ఎల్ఐసీలో మరో సూపర్‌ పాలసీ

  • Publish Date - March 19, 2024 / 05:05 PM IST

LIC policy : మనిషి జీవితం ఎంతో విలువైనది. లైఫ్ సంతోషంగా సాగాలంటే ఆర్థిక ప్రణాళికలు చాలా ముఖ్యం. సరైన ప్రణాళిక లేకుంటే జీవితం చివరి దశలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. జీవిత చరమాంకంలో ఇబ్బందులపాలు కాకుండా ఉండేందుకు.. బీమా సంస్థలు రకరకాల పాలసీలను అందిస్తుంటాయి. వాటిలో మనకు తగ్గవి ఎంచుకుని పెట్టుబడులు పెడితే అవసరమైనప్పుడు మంచి రిటర్న్స్ వస్తాయి. తాజాగా ఎల్ఐసీ అలాంటిదే ఓ కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీకి ఐదేండ్లు ప్రీమియం కడితే లైఫ్ టైమ్‌ రిటర్న్స్ వస్తుంటాయి. మరి ఈ పాలసీ వివరాలను పూర్తిగా తెలుసుకుందాం…

లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా గురించి (LIC) ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వినియోదారులకు అనేక రకాల బీమా పాలసీలు అందిస్తుంటుంది. ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరార్థం కొత్త కొత్త పాలసీను ప్రారంభిస్తుంది. తాజాగా జీవన్ ఉత్సవ్ పేరుతో ఎల్‌ఐసీ కొత్త్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. జీవితాంతం గ్యారెంటీ రిటర్న్స్ అందించడం ఈ ప్లాన్ ప్రత్యేకత. పాలసీదారు జీవించి ఉన్నంత కాలం ప్రతి ఏడాది పెట్టుపడిలో 10 శాతం నగదు అందిస్తుంది. నెలకు రూ.4 వేలపైన గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి.

ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ ప్లాన్ కొనుగోలు చేసేందుకు 90 రోజుల వయసు నుంచి గరిష్టంగా 65 ఏళ్ల వరకు వయసున్న వారు అర్హులు. మినిమం బేసిక్ సమ్‌ అష్యూర్డ్ రూ.5 లక్షలుగా ఉంది. ఈ పాలసీ ప్రీమియం చెల్లింపు కాలపరిమితిని ఐదేళ్ల నుంచి 16 ఏళ్ల మధ్య ఎంపిక చేసుకోవచ్చు. ఈ ప్లాన్ తీసుకున్న పాలసీదారులకు సమ్ అష్యూర్డ్ మొత్తంలో నుంచి ప్రతి ఏటా 10 శాతం చొప్పున జీవితాంతం చెల్లిస్తుంది. ఒక వేళ పాలసీదారుడు 100 ఏళ్లు వచ్చే వరకు జీవించి ఉన్నా కూడా ఆ 10 శాతం చొప్పన రిటర్న్స్ అందుతుంది.

ఉదాహరణకు.. జీవన్ ఉత్సవ్ పాలసీ మినిమం సమ్ అష్యూర్డ్ రూ.5 లక్షలుగా ఉంది. దీనికి 5 ఏళ్ల ప్రీమియం టర్మ్ ఎంచుకున్నట్లయితే జీఎస్టీతో కలిపి ప్రతి ఏటా దాదాపు రూ.1.16 లక్షల ప్రీమియం చెల్లించాలి. ప్రీమియం పేమెంట్ టర్మ్ పూర్తైన తర్వాత మరో 5 ఏళ్ల పాటు వేచి చూడాలి. ఆ తర్వాత ఏడాది నుంచి సమ్ అష్యూర్డ్‌లో 10 శాతం ప్రతి ఏటా అందిస్తారు. అంటే మీ చేతికి రూ.50 వేలు ప్రతి ఏటా వస్తాయి. మీ జీవితాంతం ప్రతి ఏటా ఈ డబ్బులు వస్తూనే ఉంటాయి. ఈ ప్రకారం చూస్తే నెలకు రూ.4,166 చొప్పున అందుతుందన్నమాట.

అయితే, ఈ పాలసీ తీసుకునే ముందు నిబంధనలను వివరంగా తెలుసుకోవాలి. ప్రీమియం చెల్లింపు టర్మ్ ఎంచుకునే దాన్ని బట్టి మనం రిటర్న్స్ తీసుకునే పీరియడ్ మారుతుంది. ఒకవేళ పాలసీదారు మరణిస్తే బీమా కవరేజీ రూ.5 లక్షలు అతని కుటుంబానికి అందుతుంది. ఇది కేవలం సహజ మరణానికి వర్తిస్తుంది. ఒక వేళ ప్రమాదాలు, ఇతర కారణలకు సంబంధించిన బెనిఫిట్స్ పొందాలంటే ప్రీమియం ఇంకా ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. ఈ పాలసీకి సంబంధించిన వివరాలను ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. 

Latest News