Site icon vidhaatha

జీవితాంతం ఆదాయాన్ని అందించే.. ఎల్‌ఐసీ జీవన్‌ ఉత్సవ్‌..!

విధాత‌: ప్రతి ఒక్కరికీ జీవిత బీమా అవసరం. అకస్మాత్తుగా ఏదైనా అనుకోని ఘటన జరిగి.. ఎవరైనా వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సందర్భంగా.. అతనిపై ఆధారపడ్డ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులపాలకుండా ఎంతో భరోసానిస్తుంది. అయితే, ఇటీవల కాలంలో జీవిత బీమా తీసుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత నుంచి జీవిత బీమా పాలసీలకు డిమాండ్‌ కొనసాగుతున్నది. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ పలు పాలసీలను తీసుకువస్తున్నది. తాజాగా తక్కువ ప్రీమియం చెల్లింపుతో జీవితకాల బీమా కవరేజ్‌తో పాటు జీవితాంతం ఆదాయాన్ని అందించే సరికొత్త ప్లాన్‌ను ఆవిష్కరించింది.


అదే జీవన్‌ ఉత్సవ్‌ బీమా ప్లాన్‌. ఇది నాన్‌ లింక్డ్‌, నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్ కాగా.. ప్లాన్‌లో ప్రీమియం చెల్లిస్తున్న సంవత్సరాల్లోనూ గ్యారంటీ ఆడిషన్స్‌ ఉండనున్నాయి. 90 రోజుల వయసున్న శిశువు నుంచి 65 సంవత్సరాల సీనియర్‌ సిటిజన్స్‌ జీవన్‌ ఉత్సవ్‌ ప్లాన్‌ తీసుకోవచ్చు. ప్లాన్‌ తీసుకున్న వారికి జీవితాంతం పాలసీ కవరేజ్‌ ఉంటుంది. పాలసీదారుడు మరణించిన సందర్భంలో బీమా మొత్తాన్ని.. గ్యారెంటీ అడిషన్స్‌తో నామినీకి అందిస్తారు.


అయితే, ఈ ప్లాన్‌లో మెచ్యూరిటీ బెనిఫిట్స్‌ మాత్రం లభించవు. ప్లాన్‌లో ఐదు రైడర్స్‌ సైతం అందుబాటులో ఉన్నాయి. పాలసీ హోల్డ్‌ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ బెనిఫిట్ రైడర్ లేదంటే.. ఎల్‌ఐసీ యాక్సిడెంట్ బెనిఫిట్ రైడ‌ర్‌ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఎల్‌ఐసీ టర్మ్‌ అస్యూరెన్స్ రైడర్.. ఎల్‌ఐసీ కొత్త క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్.. ఎల్‌ఐసీ ప్రీమియం మినహాయింపు బెనిఫిట్ రైడర్‌లను అర్హత, షరతులకు లోబడి తీసుకునే వీలుంటుంది. అయితే, వాటి కోసం అదనంగా ప్రీమియం చెల్లించాల్సి రానున్నది.


ప్లాన్‌ వివరాలు..


ఈ ప్లాన్‌లో జీవితకాలం బీమా కవరేజ్‌తో పాటు జీవితాంతం ఆదాయం లభిస్తుంది. ప్లాన్‌లో కనీసం ఐదేళ్ల పాటు ప్రీమియం చెల్లించాలి. గరిష్ఠంగా 16 ఏళ్లపాటు చెల్లించాలి. పాలసీ సంవత్సరం ముగిసిన తర్వాత బీమా చేసిన కనీసం మొత్తంలో ప్రతీ రూ.1000కి రూ.40 గ్యారెంటీ అడిషన్‌ జోడిస్తారు. ప్రీమియం చెల్లింపు పీరియడ్‌ ముగిసిన తర్వాత పాలసీ హోల్డర్లకు రెగ్యులర్‌ ఇన్‌కం, ఫ్లెక్సి ఇన్ కం రెండు ఆప్షన్లను ఇస్తారు. రెగ్యులర్ ఇన్ కం ఆప్షన్‌ను ఎంచుకుంటే.. మూడు లేదంటే ఆరు సంవత్సరాల డిఫర్మెంట్ పీరియడ్ ముగిసిన తరువాత ప్రతీ పాలసీ సంవత్సరం చివరలో ఇన్సూర్ చేసిన మొత్తంలో నుంచి 10శాతం డబ్బును చెల్లిస్తారు.


ఫ్లెక్సి ఇన్ కం ఆప్షన్‌ను ఎంచుకుంటే.. డిఫర్మెంట్ పీరియడ్ ముగిసిన తర్వాత.. ప్రతీ పాలసీ సంవత్సరం చివరలో ఇన్సూర్ చేసిన మొత్తంలో నుంచి 10శాతండబ్బును బేసిక్ సమ్‌కు కలుపుతారు. ఆ మొత్తాన్ని నిబంధనల మేరకు ఎప్పుడైనా విత్ డ్రా చేసుకునే వీలుంటుంది. ఈ మొత్తానికి ఎల్ఐసీ 5.5శాతం వడ్డీ సైతం ఇస్తుంది. పాలసీపై పాలసీదారుడు రుణం తీసుకునే అవకాశం సైతం ఉంటుంది.

Exit mobile version